మెటర్నిటీ బెనిఫిట్ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
Sakshi Education
భారతదేశం- శ్రామిక విధానం
ఆర్థికాభివృద్ధి, సాంఘిక న్యాయసాధన లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశంలో శ్రామిక విధానం రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246లో శ్రామికులు, శ్రామిక సంక్షేమానికి సంబంధించిన అంశాలు జాబితా-3 (ఉమ్మడి జాబితా)లో చేర్చారు. గనులు, చమురు క్షేత్రాల్లో భద్రత, యూనియన్ ఉద్యోగులకు సంబంధించిన పారిశ్రామిక వివాదాలను కేంద్ర జాబితాలో చేర్చారు.
అధిక వృద్ధి సాధనకు శ్రామిక శక్తి నైపుణ్యత అభివృద్ధి ద్వారా శ్రమసాంద్రత రంగాలపై దృష్టి కేంద్రీకరించడంతోపాటు శ్రామిక చట్టాల్లో సరళత, ఆవశ్యకతలను డా. రంగరాజన్ వెలిబుచ్చారు. శ్రామిక చట్టాల సరళత ఆవశ్యకతను మాజీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా స్పష్టంగా తెలియజేశారు. శ్రామిక చట్టాల సరళత కారణంగా ఆర్థిక వ్యవస్థ అధిక పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అధిక ఉపాధి సృష్టించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రామిక చట్టాలు, నియంత్రణలను రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఉమ్మడి జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో శ్రామికుల నియంత్రణకు సంబంధించిన ఎంట్రీలు కింది విధంగా ఉన్నాయి.
కేంద్ర జాబితా
ఆర్థికాభివృద్ధి, సాంఘిక న్యాయసాధన లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశంలో శ్రామిక విధానం రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246లో శ్రామికులు, శ్రామిక సంక్షేమానికి సంబంధించిన అంశాలు జాబితా-3 (ఉమ్మడి జాబితా)లో చేర్చారు. గనులు, చమురు క్షేత్రాల్లో భద్రత, యూనియన్ ఉద్యోగులకు సంబంధించిన పారిశ్రామిక వివాదాలను కేంద్ర జాబితాలో చేర్చారు.
అధిక వృద్ధి సాధనకు శ్రామిక శక్తి నైపుణ్యత అభివృద్ధి ద్వారా శ్రమసాంద్రత రంగాలపై దృష్టి కేంద్రీకరించడంతోపాటు శ్రామిక చట్టాల్లో సరళత, ఆవశ్యకతలను డా. రంగరాజన్ వెలిబుచ్చారు. శ్రామిక చట్టాల సరళత ఆవశ్యకతను మాజీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా స్పష్టంగా తెలియజేశారు. శ్రామిక చట్టాల సరళత కారణంగా ఆర్థిక వ్యవస్థ అధిక పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అధిక ఉపాధి సృష్టించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రామిక చట్టాలు, నియంత్రణలను రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఉమ్మడి జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో శ్రామికుల నియంత్రణకు సంబంధించిన ఎంట్రీలు కింది విధంగా ఉన్నాయి.
కేంద్ర జాబితా
- ఎంట్రీ నంబర్ 55: శ్రామికుల నియంత్రణ; గనులు, చమురు క్షేత్రాల్లో భద్రత.
- ఎంట్రీ నంబర్ 61: యూనియన్ ఉద్యోగులకు సంబంధించిన పారిశ్రామిక వివాదాలు.
- ఎంట్రీ నంబర్ 65: వృత్తిపరమైన, సాంకేతిక లేదా ఒకేషనల్ శిక్షణకు సంబంధించి కేంద్ర ఏజెన్సీలు, సంస్థలు.
- ఎంట్రీ నంబర్ 22: ట్రేడ్ యూనియన్లు, పారిశ్రామిక, శ్రామిక వివాదాలు.
- ఎంట్రీ నంబర్ 23: సాంఘిక భద్రత, బీమా, ఉపాధి, నిరుద్యోగిత.
- ఎంట్రీ నంబర్ 24: శ్రామిక సంక్షేమంలో భాగంగా పనిచేసే పరిస్థితులు, ప్రావిడెంట్ ఫండ్, నష్టపరిహారం, వృద్ధాప్య పింఛను, మెటర్నిటీ బెనిఫిట్.
- కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు, వివిధ శ్రామిక యూనియన్ల కార్యకలాపాలు సమన్వయం చేసేందుకు 1920లో ఏర్పాటైన యూనియన్?
- ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకంలో భాగంగా ప్రతి కార్మికుడి తరఫున కార్మిక శాఖ ఏడాదికి ఎంత ప్రీమియం చెల్లిస్తుంది?
- రూ.134 - ప్రాథమికరంగంలో ఎక్కువ శాతం మంది పనిచేస్తే వాస్తవిక తలసరి ఆదాయం అల్పస్థాయిలో ఉంటుందని.. ద్వితీయ, తృతీయ రంగాల్లో పనిచేస్తే వాస్తవిక తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుందని ఎవరు అభిప్రాయపడ్డారు?
-కాలిన్ క్లార్‌క - కార్మిక మంత్రిత్వ శాఖ 2007 నుంచి ఏ పథకం కింద కార్మికులకు గృహవసతి కల్పిస్తోంది?
- రివైజ్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీం - మెటర్నిటీ బెనిఫిట్ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
- 1961 - 46వ భారత కార్మిక సదస్సులో ప్రారంభించిన పోర్టల్ ఏది?
- జాతీయ ఉపాధి సేవ - ఎంప్లాయీస్ లయబులిటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు?
-1938 - లేబర్ బ్యూరోను ఎక్కడ ఏర్పాటు చేశారు?
- చండీగఢ్ - పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్-1965ను 2015లో సవరించడం ద్వారా నెలకు బోనస్ రూ.10 వేల నుంచి ఎంత ఇవ్వవచ్చని నిర్ణయించారు?
- రూ.21 వేలు - పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ యాక్ట్‌ను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు?
- 1972 - అవ్యవస్థీకృత రంగ వర్కర్‌స బిల్లు-2005 ఎప్పటి నుంచి చట్టంగా అమల్లోకి వచ్చింది?
- 2008 - అనాధ, పేద పిల్లలకు వ్యాపార వృత్తుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టం?
- మొదటి అప్రెంటీస్ చట్టం-1850 - 2011 లెక్కల ప్రకారం అత్యధిక బాల కార్మికులు ఉన్న రాష్ర్టం?
- ఉత్తరప్రదేశ్ - 2011 లెక్కల ప్రకారం పనిలో పాల్గొనే వారి రేటు అధికంగా ఉన్న రాష్ర్టం?
-హిమాచ ల్‌ప్రదేశ్ - రాజ్యాంగంలోని ఏ భాగంలోని అధికరణలు డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను ప్రస్తావించాయి?
- 3, 4 - పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులకు నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా 1923లో ఏర్పాటు చేసిన చట్టం ఏది?
- వర్‌కమెన్‌స కాంపంజేషన్ యాక్ట్ - యాజమాన్యానికి, కార్మికులకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన చట్టం?
- పారిశ్రామిక వివాదాల చట్టం - ట్రేడ్ యూనియన్ చట్టం-1926 లక్ష్యం?
- రిజిస్టరైన ట్రేడ్ యూనియన్లకు చట్టబద్దత, కార్పొరేషన్ ప్రతిపత్తి కల్పించడం - ఇంగ్లిష్ ఫ్యాక్టరీ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
- 1802 - స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన బోనస్ కమిషన్‌ను నియమించింది?
- ఎం.ఆర్.మెహర్ - భారతదేశంలో 1918లో మొదటి రిజిస్టర్ కార్మిక సంఘాన్ని ఏవరు స్థాపించారు?
- బి.పి.వాడియా - చంద్రన్న బీమా పథకం కింద లబ్ధిదారుల వయోపరిమితి ఎంత?
- 18 నుంచి 70 ఏళ్లు - చిన్నషాపులు, అంగళ్లను ఏడాది పొడవునా (365 రోజులు)తెరచి వ్యాపారం నిర్వహించుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కల్పించింది?
- 2016, మే 24 - బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
- 1986 - పారిశ్రామిక వివాదాలు పెరగడానికి కారణం?
- అధిక వేతనాలు, అలవెన్సులు, బోనస్ కోసం శ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరగడం, కర్మాగారాల్లో పనిచేసే పరిస్థితులను మెరుగుపరచమని కోరడం - 46వ భారత కార్మిక సదస్సును 2015లో ఎక్కడ నిర్వహించారు?
- ఢిల్లీ - ఆంధ్రప్రదేశ్‌లో రవాణారంగ కార్మికుల సాంఘిక భద్రతా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, మే 1 - లేబర్ లా చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
- 1988 - ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆరు నెలలపాటు నిరుద్యోగ భృతి అందించే లక్ష్యంతో 2005, ఏప్రిల్ 1న ప్రారంభించిన పథకం?
- రాజీవ్ గాంధీ శ్రామిక కల్యాణ్ పథకం - భారతదేశ కార్మిక ఉద్యమ పితామహుడు?
- లోఖాండే - ఎంప్లాయీస్ ప్రావిడెంట్‌ఫండ్ అండ్ మిస్‌లేనియస్ ప్రొవిజన్‌స చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
- 1952 - ఏ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ప్రభుత్వం కాంట్రాక్ట్ లేబర్‌ను నిషేధించి.. వారిని కొన్ని అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పింది?
-కాంట్రాక్ట్ లేబర్(రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్) చట్టం - 1970 - పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్‌ను తీసుకొచ్చిన సంవత్సరం?
-1972 - నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
- 2004 - ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు?
- సర్దార్ వల్లబాయ్ పటేల్ - పది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో విద్యుత్ యంత్ర సహాయంతో లేదా యంత్ర సహాయం లేకుండా నడపగలిగే కేంద్రాన్ని కర్మాగారంగా ఏ చట్టం నిర్వచించింది?
- కర్మాగారాల చట్టం-1948 - డెరైక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ నెలకొల్పిన ప్రాంతం?
- ధన్‌బాద్ - పారిశ్రామిక సంస్థల లాకౌట్‌కు కారణంగా దేన్ని పేర్కొనవచ్చు?
- ప్రపంచీకరణ యుగంలో పోటీతత్వం పెరుగుదల, శ్రామిక ఉత్పాదకత పెరుగుదలలో వైఫల్యం - ప్రణాళిక సంఘం 11వ పంచవర్ష ప్రణాళిక సందర్భంగా శ్రామిక చట్టాలు, నియంత్రణపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ అధ్యక్షులు?
- కె.ఎం.సాహ్ని - మైనింగ్ కమిటీ సిఫార్సులపై ఇండియన్ మైన్స్ చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం?
- 1901 - భవన నిర్మాణ కార్మికులకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ పథకాలను అమలుచేస్తుంది?
- 15 - వైట్ కాలర్ శ్రామికులు అనే పదాన్ని 1930లో ప్రవేశపెట్టిన వారు?
- అప్‌టాక్ సింక్లెయిర్ - సోషలిస్ట్ అనే ఆంగ్ల వారపత్రికను నడిపినవారు?
- డాంగే - 1918లో అహ్మదాబాద్ కార్మికులతో ‘మజ్దూర్ మహాజన్ సంఘ్’ అనే కార్మిక సంస్థను స్థాపించి.. వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి?
- మహాత్మాగాంధీ - అసంఘటిత రంగం అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది?
- కీత్ హర్ట్ - 1890లో భారతదేశంలో మొదటిగా లేబర్ అసోసియేషన్ స్థాపించిన వారు?
-లోఖాండే - భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం?
- బాంబే మిల్ హ్యాండ్ అసోసియేషన్ - కనీస వేతనాల చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం?
- 1948 - జువైనల్ జస్టిస్ యాక్ట్ తీసుకొచ్చిన సంవత్సరం?
- 2000 - వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పిన ప్రాంతం?
- నోయిడా - ప్రసూతి సెలవులను 9 నెలలకు పెంచుతూ 2016లో జీవో జారీచేసిన రాష్ట్రం?
- తెలంగాణ - ఉత్పత్తి లేక ఉత్పాదకత ఆధారంగా లేదా వచ్చిన లాభాల ఆధారంగా కార్మికులకు బోనస్ ఇవ్వడానికి ఉద్దేశించిన పథకం?
- పేమెంట్ అండ్ బోనస్ యాక్ట్ 1956 - ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు ముగ్గురూ కలసి.. ఏదైనా కార్మిక నిర్ణయం, విధానాలను రూపొందించే విధానం?
- త్రిపాటిజం - మొదటి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
- 1946, మే - ఐ.ఎన్.టి.యు.సిని ఏర్పాటు చేసిన సంవత్సరం?
- 1947
Published date : 03 Mar 2017 12:55PM