జి.ఎస్.టి. కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించేది ఎవరు?
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థైలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు బ్రిక్స్‌లో సభ్య దేశాలు. 2019 నవంబర్ 13-14న 11వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్‌లోని బ్రెసిలియాలో జరిగింది. Economic Growth for an Innovative Future నేపథ్యంగా ఈ సదస్సు బ్రెసిలియా డిక్లరేషన్‌ను రూపొందించింది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న రక్షిత విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవరోధమని సదస్సు గుర్తించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సొంత ప్రయోజనాల పరిరక్షణకు బహుళ పాక్షిక వాణిజ్యం (Multilateralism) ప్రధానమైంది. ఐక్యరాజ్య సమితితోపాటు బహుళపక్ష సంస్థలైన ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధిని పటిష్టపరచడంతోపాటు సంస్కరణలను ఆయా సంస్థల్లో తీసుకురావలసిన ఆవశ్యవతను సదస్సు గుర్తించింది. తీవ్రవాదం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతి సంవత్సరం ఒక ట్రిలియన్ డాలర్ల నష్టం జరుగుతున్నదని భారత్ పేర్కొంది. మొదటి ‘బ్రిక్స్ దేశాల water ministers సమావేశం నిర్వహిస్తామని భారత్ ప్రతిపాదించింది. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా 15 శాతం. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో పెట్టుబడులకు సభ్య దేశాల వ్యాపార వేత్తలను భారత్ ఆహ్వానించింది. భారత పౌరులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతించాలని బ్రెజిల్ నిర్ణయించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో పెట్టుబడులకు భారత్‌ను రష్యా ఆహ్వానించింది.
2018 ఫిబ్రవరి నుంచి భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నిర్వచనం మార్పులో భాగంగా పెట్టుబడుల స్థానంలో వార్షిక టర్నోవర్‌ను తీసుకోవడం జరిగింది. వార్షిక టర్నోవర్ పరిమితి సూక్ష్మ సంస్థలకు రూ. 5 కోట్ల కంటే తక్కువ, చిన్న సంస్థలకు రూ. 5 కోట్ల నుంచి రూ. 75 కోట్లు, మధ్య తరహా సంస్థలకు రూ. 75 నుంచి 250 కోట్లుగా ప్రతిపాదించారు. తయారీ, సేవా రంగంలో నిమగ్నమైన ఆయా సంస్థలకు ఈ పరిమితి వర్తిస్తుంది.
భారత్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీతోపాటు మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదించింది. బి.పి.సి.ఎల్.లో 53.29 శాతం, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 63.75 శాతం, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 30.8 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తేహ్రి హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, నార్త ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోను పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ప్రతిపాదించిన పన్నురాబడిలో 36.8 శాతం, రుణేతర మూలధన రాబడిలో 17.2 శాతాన్ని మాత్రమే 2019 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వం సాధించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవలి కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో స్వల్ప పెరుగుదల, గ్రామీణ వ్యవసాయ వేతనాల్లో కొద్దిపాటి పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభానికి కారణాలుగా నిలిచాయి. గత ఐదు సంవత్సరాలుగా అనేక పేదల అనుకూల సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. దీర్ఘకాల పేదరికం బహుమితీయ పేదరికంలో 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో తగ్గుదల ఏర్పడింది. బహుమితీయ పేదరికాన్ని పౌష్టికాహారం, పిల్లల మరణాలు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విదుచ్ఛక్తి, హౌసింగ్, ఆస్తులు, Years of schooling నిర్ణయిస్తాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుకు 2012-13 బడ్జెట్లో రూ. 50,162 కోట్లను కేటాయించగా ఈ మొత్తం 2019-20లో రూ. 1.18 లక్షల కోట్లకు పెరిగింది. గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ రోడ్ల కనెక్టివిటీలోను ప్రగతి ఏర్పడింది. తద్వారా 97 శాతం అర్హతకల్గిన, Feasible హాబిటేషన్స్కు రోడ్ల కనెక్టివిటీ ఏర్పడింది. 2018-19లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.268 కోట్ల వ్యక్తిగత పని దినాలు కల్పించారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో ‘దీనదయాళ్ అంత్యోదయ యోజన’ పథకం కింద రూ.2,12,000 కోట్ల రుణాన్ని అందించారు.
మాదిరి ప్రశ్నలు :
1. భారత్ వెలుపల నివసించే వ్యక్తులు కింది ఏ ఉద్దేశం నిమిత్తం ఖాతాను ప్రారంభించడాన్ని అనుమతిస్తూ ‘స్పెషల్ నాన్ రెసిడెంట్ రూపీ’ పరిధిని రిజర్వుబ్యాంకు విస్తరించింది?
1) బహిర్గత వాణిజ్య రుణాలు
2) వాణిజ్య పరపతి
3) వాణిజ్య (ఎగుమతి / దిగుమతి) ఇన్వాయిసింగ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
2. ‘ఇండియా-యూరప్29’కు సంబంధించి 5వ సమావేశం నవంబర్ 20-21 మధ్య కింది ఏ ప్రాంతంలో జరిగింది?
1) లిస్బన్
2) న్యూఢిల్లీ
3) వియన్నా
4) బుడాపెస్ట్
- View Answer
- సమాధానం: 2
3. కింది ఏ ప్రభుత్వరంగ బీమా కంపెనీలను విలీనం చేస్తామని ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో ప్రకటించింది?
ఎ) యునెటైడ్ ఇండియా ఇన్సురెన్స్ లిమిటెడ్
బి) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
సి) ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
డి) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
1) ఎ, బి
2) సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
4. కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో ‘లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన అంతర్జాతీయ విత్త సంస్థ ఏది?
1) ప్రపంచ బ్యాంకు
2) ఐ.ఎం.ఎఫ్.
3) ఆసియా అభివృద్ధి బ్యాంకు
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
5.ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం కింది ఏ ప్రాంతంలో ఉంది?
1) న్యూఢిల్లీ
2) బీజింగ్
3) ఢాకా
4) ఖాట్మాండు
- View Answer
- సమాధానం: 2
6. 2019 నవంబర్ 14న న్యూఢిల్లీలో ప్రారంభమైన ‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ థీమ్ ఏమిటి?
1) ఎకానమీ అండ్ ట్రేడ్
2) నియోలిబరలిజంలో ప్రపంచ మార్కెట్లు
3) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
4) బిగ్‌డేటా
- View Answer
- సమాధానం: 3
7. ప్రపంచంలో మొదటి ‘సి.ఎన్.జి. పోర్ట్ టెర్మినల్’ సౌకర్యం కింది ఏ నౌకశ్రయంలో ఉంది?
1) షాంఘై పోర్ట్
2) ది పోర్ట్ ఆఫ్ సింగపూర్
3) భావ్‌నగర్ పోర్ట్
4) పోర్ట్ ఆఫ్ బుసాన్
- View Answer
- సమాధానం: 3
8. ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనెజ్మెంట్ను కింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?
1) కోల్‌కతా
2) హైదరాబాద్
3) బిలాస్పూర్
4) రాయ్‌పూర్
- View Answer
- సమాధానం: 2
9. చెన్నై-కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో విద్యుత్ కనెక్టివిటీ మెరుగుపరచడానికి 541 మిలియన్ డాలర్ల రుణం అందిస్తున్న సంస్థ ఏది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) సిటీగ్రూప్
3) బ్యాంక్ ఆఫ్ అమెరికా
4) బ్యాంక్ ఆఫ్ చైనా
- View Answer
- సమాధానం: 1
10. జాతీయ పెట్టుబడి, అవస్థాపన నిధిని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది?
1) 2007
2) 2011
3) 2015
4) 2018
- View Answer
- సమాధానం: 3
11. ఇటీవల భారత ప్రభుత్వం కింది ఏ ప్రభుత్వరంగ సంస్థలకు ‘మహారత్న హోదా’ను ప్రకటించింది?
ఎ) హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
బి) పవర్ గ్రిడ్ కార్పొరేషన్
సి) ఆయిల్ ఇండియా లిమిటెడ్
డి) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
1) ఎ మాత్రమే
2) ఎ, బి
3) సి
4) డి
- View Answer
- సమాధానం: 2
12. ఎం.ఎల్.దంత్వాలా కమిటీ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) చిన్న తరహా పరిశ్రమలు
2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
3) చక్కెర పరిశ్రమ
4) జౌళి పరిశ్రమ
- View Answer
- సమాధానం: 2
13. వేతనాలు, ఆదాయం, ధరలకు సంబంధించి ఏర్పటైన కమిటీ ఏది?
1) భూతలింగం కమిటీ
2) కాల్డర్ కమిటీ
3) రాజాచెల్లయ్య కమిటీ
4) కామత్ కమిటీ
- View Answer
- సమాధానం: 1
14. కింది వాటిలో రాజ్యంగబద్ధమైన సంస్థ ఏది?
1) నీతి ఆయోగ్
2) జాతీయ అభివృద్ధి కౌన్సిల్
3) లోక్‌పాల్, లోకాయుక్త
4) ఆర్థిక సంఘం
- View Answer
- సమాధానం: 4
15. కింది వాటిలో రాజ్యంగబద్ధమైన సంస్థ ఏది?
1) నీతి ఆయోగ్
2) జాతీయ అభివృద్ధి కౌన్సిల్
3) లోక్‌పాల్, లోకాయుక్త
4) ఆర్థిక సంఘం
- View Answer
- సమాధానం: 2
16. ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి అధిక రుణాన్ని పొందిన దేశం ఏది?
1) ఇండియా
2) చైనా
3) బంగ్లాదేశ్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
17. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర కార్యాలయం హరియాణా లో కింది ఏ ప్రాంతంలో ఉంది?
1) అంబాలా
2) గురుగ్రాం
3) పానిపట్
4) పంచ్‌కుల
- View Answer
- సమాధానం: 2
18. తొమ్మిది లక్షల కోట్ల మార్కెట్ కాపిటలైజేషన్కు చేరుకున్న మొదటి భారతీయ కంపెనీ ఏది?
1) రిలయన్స్ ఇండస్ట్రీస్
2) బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్
3) ఎస్సార్ గ్రూప్
4) ఎల్ అండ్ టీ
- View Answer
- సమాధానం: 1
19. కార్పొరేట్ రుణాల విషయంలో సెకండరీ మార్కెట్ అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి రిజర్వుబ్యాంకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స అధ్యక్షులు ఎవరు?
1) అరవింద్ పనగారియా
2) టి.ఎన్.మనోహర్
3) రంగరాజన్
4) వై.వి. రెడ్డి
- View Answer
- సమాధానం: 2
20. Ganga Aamantran abhiyan ను కింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ
2) తాగునీరు పారిశుద్ధ్యం మంత్రిత్వశాఖ
3) జల్‌శక్తి మంత్రిత్వశాఖ
4) పర్యావరణ మంత్రిత్వశాఖ
- View Answer
- సమాధానం: 3
21. ద్రవ్య విధాన కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ద్రవ్యవిధాన వమిటీలో సభ్యుల సంఖ్య 6
బి) ఫైనాన్స్ చట్టం 2016 ప్రకారం ద్రవ్య విధాన కమిటీ ఏర్పాటైంది
సి) ద్రవ్య విధాన కమిటీకి అధ్యక్షత విహంచేది రిజర్వు బ్యాంకు గవర్నర్
డి) పైవేవీకావు
1) ఎ
2) బి, సి
3) ఎ, బి, సి
4) డి
- View Answer
- సమాధానం: 3
22. 2019 నవంబర్ 29 నాటికి రెపోరేటు ఎంత?
1) 5.15 శాతం
2) 5.75 శాతం
3) 5.58 శాతం
4) 6.1 శాతం
- View Answer
- సమాధానం: 1
23. జి.ఎస్.టి. కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించేది ఎవరు?
1) వాణిజ్యమంత్రి
2) ఆర్థిక మంత్రి
3) విదేశీ వ్యవహారాల మంత్రి
4) ప్రధాన మంత్రి
- View Answer
- సమాధానం: 2
24.Nirvik పథకాన్ని ప్రారంభించింది ఎవరు?
1) పర్యావరణ మంత్రిత్వ శాఖ
2) ది ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3) ఐ.సి.ఐ.సి.ఐ.
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
25. కింది వాటిలో ఏ నివేదికను వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేస్తుంది?
1) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
2) గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్
3) గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
26. తయారీరంగానికి సంబంధించిన చిన్న సంస్థల వార్షిక టర్నోవర్ పరిమితి ఎంత?
1) రూ. 1 కోటి
2) రూ. 3-4 కోట్లు
3) రూ. 5 కోట్లు
4) రూ.5-75 కోట్లు
- View Answer
- సమాధానం: 4
27. పదకొండో బ్రిక్స్ సదస్సు 2019 నవంబర్ 13-14న ఎక్కడ జరిగింది?
1) బ్రెసిలియా
2) మాస్కో
3) బీజింగ్
4) ప్రెటోరియా
- View Answer
- సమాధానం: 1
28. ‘నివేష్ మిత్ర’కు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆన్లైన్ ఏకగవాక్ష వ్యవస్థ
2) తెలంగాణలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవ స్థ
3) మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
29.ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాణిజ్యం వాటా ఎంత?
1) 9 శాతం
2) 11 శాతం
3) 13 శాతం
4) 15 శాతం
- View Answer
- సమాధానం: 4
30. ఇటీవల భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని కింది ఏ దేశం అనుమతించింది?
1) రష్యా
2) బ్రెజిల్
3) చైనా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2