భారత ప్రభుత్వ మొత్తం రుణంలో విదేశీ రుణం వాటా ఎంత?
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని ప్రభుత్వాలకు రుణ నిర్వహణ సవాలుగా పరిణమించింది. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర ఆర్థిక సంఘాలు సూచించిన లక్ష్యం కంటే అధిక రుణ-జీడీపీ నిష్పత్తి భారత్‌లో నమోదైంది. భారత్ మొత్తం ప్రభుత్వం రుణంలో స్వదేశీ రుణం వాటా 95 శాతం కాగా విదేశీ రుణం 5 శాతం. అధిక ప్రభుత్వ రుణం దేశంలో విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితికి దారి తీయడమే కాకుండా వడ్డీరేటు, ద్రవ్యోల్బణం, పెట్టుబడిలాంటి స్థూల ఆర్థిక చలాంకాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం 2003ను అమలు చేయడంతోపాటు ఎఫ్.ఆర్.బి.ఎం. సమీక్ష కమిటీ, 2017 సిఫార్సులను అమలు చేయడం ద్వారా Fiscal consolidation సాధనకు భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. 2017-18తో పోల్చినప్పడు 2018-19లో కేంద్ర ప్రభుత్వ బడ్జెటరీ వ్యయంలో తగ్గుదల జీడీపీలో 0.3 శాతం, రెవెన్యూ వ్యయంలో 0.4 శాతం, మూలధన వ్యయంలో 0.1 శాతం తగ్గుదల నమోదైంది.
ప్రభుత్వ రుణం- ఆధారాలు
భారత ప్రభుత్వ రుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర liabilities తో పాటు ప్రభుత్వ రుణం భాగంగా ఉంటుంది. ప్రభుత్వ రుణంలో
1. అంతర్గత రుణం, iabilities
2. కేంద్ర ప్రభుత్వ బహిర్గత రుణం
3. కేంద్ర ప్రభుత్వ రుణం మినహాయించగా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ రుణం భాగంగా ఉంటుంది.
A. కేంద్ర ప్రభుత్వ అంతర్గత రుణ ఆధారాలు:
మార్కెట్ రుణాలు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ప్రత్యేక ఫ్లోటింగ్, ఇతర రుణాలు, ఇతర iabilities కు సంబంధించి చిన్న మొత్తాల పొదుపు వసూళ్లు, ప్రావిడెంట్‌ఫండ్, పోస్టల్ బీమా అండ్ లైఫ్ Annuity fund, హిందూ ఫ్యామిలీ Annuity fund, నిర్బంధ డిపాజిట్లు, ఆదాయపు పన్ను Annuity డిపాజిట్లు.
B. రాష్ట్ర ప్రభుత్వ రుణ ఆధారాలు:
అంతర్గత రుణం, కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన రుణాలు, అడ్వాన్స్లు, ప్రావిడెంట్ ఫండ్, చిన్న మొత్తాల పొదుపు, ట్రస్ట్స్, ఎండోమెంట్స్, బీమా, పెన్షన్ ఫండ్.
రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణానికి మార్కెట్ రుణాలు, బాండ్లు, రిజర్‌వ బ్యాంక్ నుంచి ‘వేస్ అండ్ మీన్స్’ అడ్వాన్స్లు, బ్యాంక్‌లు ఇతర ఆర్థిక సంస్థల నుంచి Negotiated రుణాలు ఆధారంగా ఉంటాయి.
C. బహిర్గత రుణం:
అంతర్జాతీయ విత్త సంస్థలైన అఈఆ, ఐఈఅ ప్రపంచ బ్యాంక్, IFAD, IMF, వాణిజ్య రుణాలు, ఎన్.ఆర్.ఐ. డిపాజిట్లు.
భారత ప్రభుత్వ రుణం - వృద్ధి:
- స్వాతంత్య్రానంతరం మొదటి రెండు దశకాల్లో (1950-51 నుంచి 1970-71) భారత ప్రభుత్వ రుణం రెట్టింపయింది. 1970-71 నుంచి 1980-81 మధ్య కాలంలో ప్రభుత్వ రుణంలో రెండు రెట్లు పెరుగుదల నమోదైంది. 1980-81 నుంచి 1990-91 మధ్య కాలంలో భారత ప్రభుత్వ రుణంలో అధిక వృద్ధి నమోదైంది. ఈ కాలంలో అంతర్గత రుణం పెరుగుదల కారణంగా అధిక రుణ వృద్ధి నమోదైంది. 1990వ దశకంలో బహిర్గత ప్రభుత్వ liabilities లోనూ పెరుగుదల ఏర్పడింది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ రుణంతో పోల్చినప్పుడు రాష్ర్ట ప్రభుత్వాల రుణంలో వృద్ధి అధికం. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వ రుణ వృద్ధిలో తగ్గుదలకు కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో క్షీణత కారణమైంది. రాష్ట్రాల స్థాయిలో కొద్దిపాటి బడ్జెటరీ సంస్కరణల కారణంగా రాష్ట్రాల రుణంలో పెరుగుదల ఏర్పడింది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణం ఫిబ్రవరి 2014 నాటికి జి.డి.పి.లో 66.7 శాతానికి చేరుకుంది. ఇదే కాలంలో గ్రీస్ ప్రభుత్వ నికర రుణం ఆ దేశ జీడీపీలో 173 శాతం, ఈజిప్ట్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, యు.కె., జపాన్, అమెరికాలు ప్రపంచంలో మొదటి 20 రుణగ్రస్త దేశాల జాబితాలో స్థానం పొందాయి. ఆయా దేశాలతో పోల్చినప్పుడు భారత్ రుణ-జీడీపీ నిష్పత్తి తక్కువగా నమోదైంది.
- ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత్ రుణం తక్కువని ఐ.ఎం.ఎఫ్. అభిప్రాయపడింది. 2017లో ప్రపంచ రుణం 182 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2017లో భారత్‌లో ప్రైవేట్ రుణం జీడీపీలో 54.5 శాతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణాన్ని జీడీపీలో 70.4 శాతంగా ఐ.ఎం.ఎఫ్. అంచనా వేసింది. మొత్తంగా ప్రైవేట్, ప్రభుత్వ రుణం భారత జీడీపీలో 125 శాతం కాగా చైనా రుణాన్ని ఆ దేశ జీడీపీలో 247 శాతంగా ఐ.ఎం.ఎఫ్. పేర్కొంది.
- 2019 జూన్ నాటికి భారత ప్రభుత్వ విదేశీ రుణం 557.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తం జీడీపీలో 19.8 శాతం. విదేశీ రుణంలో వాణిజ్య రుణం వాటా అధికం కాగా తర్వాతి స్థానాల్లో ఎన్.ఆర్.ఐ. డిపాజిట్లు, స్వల్పకాల వాణిజ్య పరపతి నిలిచాయి. మొత్తం విదేశీ రుణంలో దీర్ఘకాల రుణ వాటా (447.7 బిలియన్ డాలర్లు) అధికం. 2019 జూన్ చివరి నాటికి భారత ప్రభుత్వ విదేశీ రుణంలో డాలర్ రూపేణా రుణ వాటా (51.5 శాతం) అధికం. 2019 మార్చితో పోల్చినప్పుడు 2019 జూన్‌లో భారత విదేశీ రుణంలో పెరుగుదల 2.6 శాతం.
- 2019 మార్చి 31 నాటికి భారత ప్రభుత్వ రుణం రూ. 89.58 లక్షల కోట్లు కాగా ఈ మొత్తంలో అంతర్గత రుణం, ఇతర iabilities తో కలుపుకొని రూ. 87.03 లక్షల కోట్లు కాగా బహిర్గత రుణం రూ.2.54 లక్షల కోట్లు.
- రాష్ట్రాల మొత్తం రాబడిలో సొంత రాబడి 2019-20లో 52.5 శాతం, కేంద్రం నుంచి బదిలీలు 47.5 శాతంగా ఉండగలదని అంచనా. సొంత రాబడిలో పన్ను, పన్నేతర రాబడుల వాటా 44.7, 7.8 శాతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నేతర రాబడి వడ్డీ రాబడులు, డివిడెంట్లు, లాభాలు, సాధారణ సేవలు, సాంఘిక సేవలు, ఆర్థిక సేవల ద్వారా లభిస్తుంది. రాష్ట్రాల మొత్తం రాబడిలో కేంద్రం నుంచి బదిలీ (47.5 శాతం)లో కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా 27 శాతం, గ్రాంట్లు 20.5 శాతం.
- రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రాబడి (రెవెన్యూ, మూలధన రాబడులు) 2015-16లో రూ. 22.99 లక్షల కోట్ల నుంచి 2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 37.63 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం రూ. 23.01 లక్షల కోట్ల నుంచి రూ. 37.68 లక్షల కోట్లకు పెరుగుతుంది.
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల Outstanding liabilities 2015 మార్చి 31 నాటికి రూ. 27.43 లక్షల కోట్లు కాగా 2019 మార్చి 31 నాటికి సవరించిన అంచనాల ప్రకారం రూ. 47.15 లక్షల కోట్లకు పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రుణ-జీడీపీ నిష్పత్తి 2020 మార్చి నాటికి 24.9 శాతంగా ఉంటుందని అంచనా.
1. వడ్డీ చెల్లింపులు - జీడీపీ నిష్పత్తి
2. వడ్డీ చెల్లింపులు - రెవెన్యూ వ్యయ నిష్పత్తి
3. Repayment - మూలధన disbursement నిష్పత్తి
4. రుణ సర్వీసింగ్ - మొత్తం disbursement నిష్పత్తి
5. వడ్డీ చెల్లింపులు - రుణ సర్వీసింగ్ నిష్పత్తి
6. రుణ సర్వీసింగ్ - స్థూల రుణాల నిష్పత్తి
మాదిరి ప్రశ్నలు
1. దేశంలో నల్లధనం పెరిగినందువల్ల సంభవించే పరిణామాలకు సంబంధించిన అంశం కానిది ఏది?
1) ఆదాయ అసమానతల తగ్గుదల
2) ద్రవ్య సప్లయ్ పెరుగుదల
3) ద్రవ్యోల్బణం
4) ప్రభుత్వ రాబడి తగ్గుదల
- View Answer
- సమాధానం: 1
2. ఒక ఆర్థిక వ్యవస్థ రుణాన్ని భరించే స్థాయిని తెలుసుకోవడానికి కింది వాటిలో ఏది ఉపకరిస్తుంది?
1) వడ్డీ చెల్లింపులు - జి.డి.పి. నిష్పత్తి
2) వడ్డీ చెల్లింపులు - రెవెన్యూ వ్యయ నిష్పత్తి
3) వడ్డీ చెల్లింపులు - రుణ సర్వీసింగ్ నిష్పత్తి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3. ఐ.ఎం.ఎఫ్. 2017లో భారత్ ప్రైవేట్, ప్రభుత్వ రుణం జి.డి.పి.లో ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది?
1) 95 శాతం
2) 125 శాతం
3) 145 శాతం
4) 247 శాతం
- View Answer
- సమాధానం: 2
4. కేంద్ర ప్రభుత్వ అంతర్గత రుణ ఆధారం కానిది ఏది?
1) మార్కెట్ రుణం
2) ట్రెజరీ బిల్లులు
3) బహిర్గత వాణిజ్య రుణం
4) నిర్బంధ డిపాజిట్లు
- View Answer
- సమాధానం: 3
5.భారత ప్రభుత్వ మొత్తం రుణంలో విదేశీ రుణం వాటా ఎంత?
1) 5 శాతం
2) 10 శాతం
3) 15 శాతం
4) 20 శాతం
- View Answer
- సమాధానం: 1
6. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విధాలైన రాబడులు, రుణాలు కింది ఏ నిధిలో జమచేస్తారు?
1) ఇండెక్స్ ఫండ్
2) కన్సాలిడేటెడ్ ఫండ్
3) సంతులిత నిధి
4) ఈక్విటీ ఫండ్
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో మూలధన రాబడిలో భాగం కానిది ఏది?
1) మార్కెట్ రుణాలు
2) గ్రాంట్లు
3) చిన్న మొత్తాల పొదుపు నుంచి రుణం
4) ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రుణం
- View Answer
- సమాధానం: 2
8. అధిక ప్రభుత్వ రుణం వల్ల కలిగే ప్రభావానికి సంబంధించి సరికానిది ఏది?
1) ఉత్పాదక పెట్టుబడుల తగ్గుదల
2) అధిక వడ్డీ చెల్లింపులు
3) ద్రవ్యోల్బణం తగ్గుదల
4) జాతీయ పొదుపు, ఆదాయంలో తగ్గుదల
- View Answer
- సమాధానం: 3
9. 2019-20లో రాష్ట్రాల మొత్తం రాబడిలో అధిక వాటా దేనికి ఉంటుందని అంచనావేయడం జరిగింది?
1) పన్ను, పన్నేతర రాబడి
2) కేంద్రం నుంచి బదిలీలు
3) విరాళాలు
4) మూలధన రాబడి
- View Answer
- సమాధానం: 1
10. కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటులో ఉద్దేశం ఏమిటి?
1) ఉత్పాదక పెట్టుబడుల నిమిత్తం
2) అత్యవసర వ్యయం కోసం రాష్ర్టపతి ఖర్చు చేయడానికి
3) వడ్డీ చెల్లింపుల నిమిత్తం
4) రాష్ట్రాలకు బదిలీ నిమిత్తం
- View Answer
- సమాధానం: 2
11. కింది వారిలో మిగులు బడ్జెట్‌కు ప్రాధాన్యమిచ్చిన ఆర్థికవేత్తలు?
1) సంప్రదాయ
2) కీన్స్
3) సప్లయ్ వైపు ఆర్థికవేత్తలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
12. కింది వాటిలో ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యత ఏమిటి?
ఎ) గ్రామీణాభివద్ధి
బి) ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం
సి) వాణిజ్యాన్ని ప్రోత్సహించడం
డి) ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి
1) ఎ, బి
2) సి మాత్రమే
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
13. ప్రభుత్వ వ్యయాన్ని విధులననుసరించి రక్షణ, సివిల్, అభివృద్ధి వ్యయంగా వర్గీకరించినవారు?
1) హిక్స్
2) ఆడమ్ స్మిత్
3) మార్షల్
4) పాల్ క్రూగ్మన్
- View Answer
- సమాధానం: 1
14. 1980-81 నుంచి 1990-91 మధ్య కాలంలో భారత ప్రభుత్వ రుణంలో అధిక వృద్ధి నమోదు కావడానికి కారణం?
1) ప్రపంచ బ్యాంక్ నుంచి అధిక రుణం తీసుకోవ డం
2) అధిక చిన్న మొత్తాల పొదుపు రుణం
3) అంతర్గత రుణంలో పెరుగుదల
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
15. కింది వాటిలో భారత్ బహిర్గత రుణ ఆధారం కానిది ఏది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంక్
2) రిజర్‌వ బ్యాంక్ నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు
3) బహిర్గత వాణిజ్య రుణం
4) ఐ.ఎఫ్.ఎ.డి. నుంచి రుణం
- View Answer
- సమాధానం: 2
16. 2019-20లో రాష్ర్ట ప్రభుత్వాల వ్యయం మొత్తం ఎంతగా అంచనా (లక్షల కోట్లలో) వేయడం జరిగింది?
1) 37.68
2) 39.75
3) 41.68
4) 45.75
- View Answer
- సమాధానం: 1
17. గరిష్ట సాంఘిక ప్రయోజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
1) కీన్స్
2) శామ్యూల్ సన్
3) డాల్టన్
4) ఆడమ్ స్మిత్
- View Answer
- సమాధానం: 3