Skip to main content

12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?

  • 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?
    - వేగవంతమైన, స్థిరత్వంతో కూడిన సమ్మిళిత వృద్ధి (Faster, Sustainable and More Inclusive Growth)
  • కేంద్ర బ్యాంకు Liquidity Adjustment Fund ఏర్పాటు చేయడంలో ఉద్దేశం?
    -వాణిజ్య బ్యాంకులకు తాత్కాలిక రుణాలు అందించడానికి
  • ద్రవ్యోల్బణానికి సప్లయ్ వైపు కారణాలు?
    - సహజ వనరుల కొరత, ఉత్పత్తి సాధనాల కొరత, కృత్రిమ కొరత
  • సంస్కరణల అమలు కాలంలో భారత్ తన పోటీతత్వాన్ని పెంచుకోవడానికి కారణాలు?
    - విత్త రంగం, పన్నుల వ్యవస్థలో సంస్కరణలు, వాణిజ్య సరళీకరణ, స్వదేశీ-విదేశీ పెట్టుబడులపై ఆంక్షల తొలగింపు
  • భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికాభివృద్ధిని ఆటంకపరిచే కారకాలు?
    - అధిక మూలధన ఉత్పత్తి నిష్పత్తి, తక్కువ మూల ధన సంచయనం, అల్ప మానవాభివృద్ధి
  • ఆర్థిక వ్యవస్థను తిరోగమనం నుంచి అభివృద్ధి వైపు పయనింపజేసే క్రమంలో ఏ విధానాల మధ్య సమన్వయం ఉండాలి?
    - ద్రవ్య, కోశ విధానాలు
  • Currency Future ట్రేడింగ్‌ను మొదటిగా ఏ స్టాక్ మార్కెట్‌లో ప్రారంభించారు?
    - నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
  • స్టాక్ మార్కెట్‌లో జరిగే హవాలా వ్యవహారాలను ఏ చట్టం ద్వారా నియంత్రిస్తున్నారు?
    - Prevention of Money Laundering Act
  • 1975లో భారత్‌లో మొదటిసారి వెంచర్ కాపిటల్ ఫండ్‌ను ప్రారంభించిన సంస్థ?
    -ఐఎఫ్‌సీఐ (IFCI)
  • భారత్‌లో పేదరికాన్ని కొలవడానికి అవసరమైన కొత్త మెథడాలజీని రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
    - సురేష్ టెండూల్కర్
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు పన్ను విధాన రేట్లను తగ్గించడంతోపాటు, ప్రభుత్వ వ్యయం పెంచుకోవడం వంటి చర్యలు ఏ స్థితిలో చేపడతాయి?
    -వ్యాపార కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు
  • ఆర్థిక మాంద్యం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
    - వస్తు, సేవలకు డిమాండ్ తగ్గడం వల్ల ధరల తగ్గుదల, జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల, స్టాక్ మార్కెట్ సంక్షోభం, అధిక నిరుద్యోగం
  • చిన్నతరహా పరిశ్రమల పరపతి సమస్యను సమీక్షించడానికి 1997లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
    - ఎస్‌ఎల్ కపూర్
  • ఉత్పత్తిదారులు తమ లాభం తగ్గకుండా ఉండడానికి ధరలు పెంచడంతో ఏర్పడే ద్రవ్యోల్బణం? - మార్క్ అప్ ద్రవ్యోల్బణం
  • వాణిజ్య బ్యాంకులు తమ ముఖ్యమైన ఖాతాదారులకు రుణాలను అందించే వడ్డీ రేటును ఏమంటారు?
    - బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు
  • దేశ పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని సిఫార్సు చేసింది?
    - హజారే కమిటీ
  • చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి అఖిల భారత స్థాయిలో బోర్డులను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు?
    - 1977 పారిశ్రామిక తీర్మానం
  • ఇండస్ ఇండ్ బ్యాంక్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
    - 1994 ఏప్రిల్ 2
  • కంపెనీల సంస్కరణలపై ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
    - జె.జె.ఇరానీ
  • ఏ కమిటీ సిఫార్సుల మేరకు MRTP చట్టాన్ని రద్దుచేసి పోటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు?
    - రాఘవన్
  • జాతీయ నూనె గింజల అభివృద్ధి బోర్డు ఎక్కడ ఉంది?
    - గుర్గావ్
  • అభిజిత్ సేన్ గుప్తా కమిటీ ఏర్పాటు ఉద్దేశం?
    - టోకు ధరల సూచీ లెక్కింపు పద్ధతిని సవరించడం
  • ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ ఏ గ్రూపునకు చెందిన సంస్థ?
    - ప్రపంచ బ్యాంకు
  • గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ను 1999లో మొదటగా ప్రారంభించిన బ్యాంకుల సంఖ్య?
    - ఐదు
  • 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జనాభా దశాబ్ద వృద్ధి?
    -12.18 శాతం
  • బ్రెయిన్ డ్రెయిన్ సమస్యను భారత్ ఎదుర్కొన్న కాలం?
    -1950-1990
  • జీరో బేస్డ్ బడ్జెటింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు?
    - అనవసరపు వ్యయాలను గుర్తించి, వాటిని తగ్గించుకోవడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో నిధులు కేటాయించడం
  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అంటే?
    - సంస్థలో 51 శాతం లేదా అంతకుమించి వాటాను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండటంతోపాటు, కంపెనీ చట్టం ప్రకారం ఆ సంస్థ నమోదై ఉండాలి.
  • నిరంతర ప్రణాళిక భావనను రూపొందించినవారు?
    - గున్నార్ మిర్థాల్
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సిఫార్సు చేసిన కమిటీ?
    - నరసింహం కమిటీ
  • డెబిట్ కార్డ్‌ను జారీ చేసిన మొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్?
    - కాశీ గోమతి సంయుత్ గ్రామీణ్ బ్యాంక్
  • పన్ను రేటు, పన్ను రాబడుల మధ్య సంబంధాన్ని తెలిపే రేఖ?
    - లాఫర్ రేఖ
  • బిగ్‌పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
  • - రోసెన్ స్టీన్‌రోడాన్
  • వ్యక్తుల ఆదాయం పెరిగే కొద్దీ ఆహార అవసరాలకు ఖర్చుచేసే వ్యయ శాతం తగ్గుతుందని తెలిపే సూత్రం?
    - ఏంజెల్ సూత్రం
  • దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదలను ఏమంటారు?
    -ఆర్థికాభివృద్ధి
  • నాలుగో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
    - గాడ్గిల్
  • ఆదాయ అసమానతలను తెలుసుకోవడానికి ఉపయోగించే రేఖ?
    - లారెంజ్ వక్ర రేఖ
  • బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని 1964లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?
    - రష్యా
  • రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరాన్ని ప్లాటినమ్ జూబ్లీ సంవత్సరంగా పరిగణించింది?
    - 2009-10
  • సేవలపై పన్నును ఏ కమిటీ సిఫార్సుల మేరకు విధించారు?
    - రాజా చెల్లయ్య కమిటీ
  • అమ్మకం పన్నును మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు?
    - జర్మనీ
  • భారత్‌లో మొదటి జీవిత బీమా కంపెనీ?
    - ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్
  • దేశంలో పొదుపును ఎక్కువగా సమకూర్చేది?
    - కుటుంబ రంగం
  • డ్రెయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
  • - దాదాభాయ్ నౌరోజీ
  • ఎవరి వృద్ధి నమూనా ఆధారంగా మూడో పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు?
    - అశోక్ మెహతా
  • భారత్‌లో నల్ల ద్రవ్యాన్ని అధ్యయనం చేసిన కమిటీ?
    - రాజమన్నార్
  • పావర్టీ అండ్ అన్‌బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త?
    - దాదాభాయ్ నౌరోజీ
  • ఇక్రిశాట్‌ను హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో స్థాపించారు?
    - 1972
  • ఏ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ ఏర్పాటైంది?
    - శివరామన్ కమిటీ
  • ఇన్‌సైడ్ ట్రేడింగ్ దేనికి సంబంధించింది?
    - షేర్ మార్కెట్
  • సూచనాత్మక ప్రణాళికను మొదటిసారి అవలంబించిన దేశం?
    - ఫ్రాన్స్
  • నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
    - రెండో ప్రణాళిక
  • స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అంటే?
    - 15 నెలల్లోపు తిరిగి చెల్లించే రుణాలు
  • హ్యండ్లూమ్స్ అభివృద్ధికి సంబంధించి ఏర్పాటైన కమిటీ?
    - మీరాసేఠ్
  • 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు?
    - నాలుగు
  • ఎగ్జిట్ విధానం అంటే?
    - ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు సంబంధించిన విధానం
  • 1991 జూలైలో రూపాయి మూల్యహీనీకరణ సమయంలో భారత ఆర్థిక మంత్రి?
    - మన్మోహన్ సింగ్
  • ఐడీబీఐ (IDBI) బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం?
    - 1964
  • జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ వస్తువులను పరిగణనలోకి తీసుకోకూడదు?
    - మాధ్యమిక, ఉత్పాదక వస్తువులు
  • భారత్‌లో జాతీయాదాయ గణనకు 1949లో ఏర్పాటైన జాతీయాదాయ కమిటీ అధ్యక్షుడు?
    - మహలనోబిస్
  • ఆర్థిక పరిభాషలో జాతీయాదాయం అంటే?
    - ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
  • జాతీయాదాయ లెక్కింపులో తృతీయ రంగం అంశాల విలువను లెక్కించడానికి వినియోగించే పద్ధతి?
    - ఆదాయ మదింపు పద్ధతి
  • ఆహార భద్రత బిల్లుకు సంబంధించి జాతీయ సలహా మండలి సిఫార్సులను పరిశీలించడానికి ఏర్పాటైన ప్యానల్?
    - రంగరాజన్ ప్యానల్
  • ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన సంవత్సరం?
    - 2003, ఏప్రిల్
  • బీమారంగంలో సంస్కరణలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ?
    - మల్హోత్రా కమిటీ
  • స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌ను మంజూరు చేసేది?
    - ఐఎంఎఫ్
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో అధిక కోటా గల దేశం?
    - అమెరికా
  • అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
    - ఎడ్విన్ కానన్
  • జనాభా స్థిరీకరణను ఏ సంవత్సరం నాటికి సాధించాలని జనాభా విధానం-2000 లక్ష్యంగా పేర్కొంది?
    - 2045
  • సురేశ్ టెండూల్కర్ కమిటీ ప్రకారం దేశంలో పేదరికం?
    - 37.2 శాతం
  • భారత్‌లోని నిరుద్యోగాన్ని ఎలా వర్ణించొచ్చు?
    - నిర్మాణాత్మక నిరుద్యోగం
  • మహానంది రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది?
    - మధ్యప్రదేశ్
  • 1988లో గృహ రుణాల రీ-ఫైనాన్స్ కోసం ఏర్పాటైన బ్యాంకు?
    - నేషనల్ హౌసింగ్ బ్యాంక్
  • భారతీయ యాజమాన్యంలో 1881లో ఆగ్రాలో స్థాపించిన బ్యాంక్?
    - ఔధ్ కమర్షియల్ బ్యాంక్
  • ప్రపంచంలోని తొలి కేంద్ర బ్యాంక్?
    - రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
  • హరిత విప్లవం ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చోటు చేసుకుంది?
    - పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్
Published date : 04 Mar 2017 01:58PM

Photo Stories