Skip to main content

గ్రూప్-1 పరీక్ష విధానంలో మార్పులు

గ్రూప్-1.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది గ్రాడ్యుయేట్లు పోటీపడే పరీక్ష! దీనిద్వారా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ తదితర ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చనే ఆకాంక్షే తీవ్ర పోటీకి కారణం! ఇందుకోసం ఏళ్ల తరబడి కృషిచేసే వారెందరో! రెండు రాష్ట్రాల్లోనూ గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలో మార్పులు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 పరీక్ష ప్రతిపాదిత విధానంపై విశ్లేషణ...
ఇటీవల యూపీఎస్సీ.. అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష విధానంలో మార్పులు చేపట్టే దిశగా అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే నోటిఫికేషన్ల నుంచే కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సివిల్స్ సిలబస్ 70 శాతం :
యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, సబ్ కమిటీ నివేదికల్లో గ్రూప్-1 సిలబస్‌లో 70 శాతం మేరకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్‌ను యథాతథంగా అమలు చేయాలని.. మిగతా 30 శాతం సిలబస్ విషయంలో ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంబంధిత కమిషన్లు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జనరల్ స్టడీస్ పేరుతో 150 మార్కులకు ఒకటే పేపర్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపాదిత విధానం ప్రకారం - ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్-1, 2) కనిపించనున్నాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 400 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది.

మెయిన్‌లోనూ మార్పులు..
ప్రతిపాదిత విధానం ప్రకారం గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలో రెండోదశ మెయిన్ ఎగ్జామినేషన్‌లోనూ మార్పులు జరగనున్నాయి. మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఆరు కంపల్సరీ పేపర్లుంటాయి. అవి.. రీజనల్ లాంగ్వేజ్ (తెలుగు), ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్-1, జనరల్ స్టడీస్-2, జనరల్ స్టడీస్-3. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు చొప్పున మొత్తం 900 మార్కులకు మెయిన్ పరీక్ష జరగనుంది.

ఇంటర్వ్యూ మార్కులు :
ప్రతిపాదిత నూతన విధానంలో ఎంపిక ప్రక్రియలో చివరి దశ ఇంటర్వ్యూ మార్కులు పెరిగాయి. ఇప్పటివరకు 75 మార్కులకు నిర్వహిస్తుండగా యూపీఎస్సీ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు మార్కులు 100కు పెరగనున్నాయి.

పేపర్ల వారీగా మార్పుల విశ్లేషణ..
పేపర్ల వారీగా మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంగ్లిష్, ఎస్సే మినహా మిగతావి (ప్రాంతీయ భాష, జనరల్ స్టడీస్-1, 2, 3) కొత్తవి. అయితే ఆయా పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలిస్తే.. అవి ప్రస్తుత సిలబస్‌ను పోలి ఉన్నాయని.. కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతిపాదిత సిలబస్.. పేపర్ల వారీగా..ప్రిలిమ్స్:
  1. జనరల్ స్టడీస్ పేపర్-1: ఈ పేపర్‌ను నాలుగు విభాగాలు (ఎ, బి, సి, డి)గా వర్గీకరించారు. సెక్షన్-ఎ: హిస్టరీ; సెక్షన్-బి: సాంస్కృతిక వారసత్వం; సెక్షన్-సి: రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు; సెక్షన్-డి: జనరల్ మెంటల్ ఎబిలిటీ.
  2. జనరల్ స్టడీస్ పేపర్-2: ఈ పేపర్‌ను కూడా ఎ, బి, సి, డిలుగా వర్గీకరించారు. సెక్షన్-ఎ: ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్; సెక్షన్-బి: జాగ్రఫీ; సెక్షన్-సి: సైన్స్ అండ్ టెక్నాలజీ; సెక్షన్-డి: ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న సమకాలీన అంశాలు.
  • ప్రస్తుతం ఒకటే పేపర్‌గా నిర్వహిస్తున్న జనరల్ స్టడీస్ పేపర్‌లోని అంశాలనే ప్రతిపాదిత సిలబస్‌లో వేర్వేరుగా పేర్కొన్నారు కాబట్టి ఆందోళన అనవసరమంటున్నారు నిపుణులు. అయితే అభ్యర్థులు తమ విషయ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం నెలకొంది.

మెయిన్స్ పేపర్ల విశ్లేషణ..
మెయిన్ ఎగ్జామినేషన్‌లో ప్రతిపాదించిన పేపర్లను పరిశీలించినా.. దాదాపు ప్రస్తుత విధానానికి కొనసాగింపనే చెప్పొచ్చు.

పేపర్-1 సబ్జెక్టు - రీజనల్ లాంగ్వేజ్ (ప్రాంతీయ భాష) :
ప్రస్తుత మెయిన్ ఎగ్జామినేషన్ విధానంతో పోల్చితే ఈ పేపర్ ఒక్కటే కొత్త పేపర్‌గా చెప్పొచ్చు. ఇందులో ఎస్సే, పద్య లేదా గద్య విశ్లేషణ, ప్రెసిస్ రైటింగ్, కాంప్రెహెన్షన్, ఫార్మల్ స్పీచ్, మీడియా పబ్లిసిటీ కోసం నివేదికల రూపకల్పన, లెటర్ రైటింగ్, డిబేట్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, డైలాగ్ రైటింగ్/డైలాగ్ స్కిల్స్, ట్రాన్స్‌లేషన్, గ్రామర్ అంశాలున్నాయి. ఈ పేపర్‌లో ప్రధానంగా పేర్కొనాల్సిన విషయం.. డిబేట్ రైటింగ్, ఎస్సే, ఫార్మల్ స్పీచ్ విభాగాల్లో సిలబస్ కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్లలోని వార్తాంశాల నుంచి ఉంటాయని పేర్కొనడం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అభ్యర్థులు ఒక విధంగా ఈ పేపర్‌ను కూడా కరెంట్ అఫైర్స్ సమ్మిళిత పేపర్‌గా భావించాల్సిన ఆవశ్యకత నెలకొంది.

పేపర్-2 సబ్జెక్ట్: ఇంగ్లిష్
ఈ పేపర్ ద్వారా ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యా లను పరీక్షిస్తారు. రీజ నల్ లాంగ్వేజ్ పేపర్లోపేర్కొన్న అంశాలే ఇందులో ఉన్నాయి.

పేపర్-3: సబ్జెక్ట్-జనరల్ ఎస్సే
ప్రతిపాదిత సిలబస్ ప్రకారం 800 పదాల్లో మూడు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్, సామాజిక-రాజకీయ అంశాలు; సామాజిక-ఆర్థిక అంశాలు; సామాజిక-పర్యావరణ అంశాలు; సంస్కృతి-చారిత్రక అంశాలు, సామాజిక అవగాహనకు సంబంధించిన అంశాలు, ప్రస్తుతం ప్రభావవంతంగా మారుతున్న అంశాలపై ఎస్సేలు అడుగుతారు. ప్రస్తుత విధానంతో పోల్చితే ప్రతిపాదిత విధానంలో పేర్కొన్న అంశాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుత విధానంలో సంక్షోభ నివారణ, సామాజిక సమస్యలు, విశ్లేషణ, పరిష్కారాలు, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యమున్న అంశాలతో జనరల్ ఎస్సే పేపర్ ఉంటోంది. ఇక్కడ ప్రధాన వ్యత్యాసం.. ఆయా అంశాలను వేర్వేరు విభాగాలుగా పేర్కొనడమే.

పేపర్-4 (జనరల్ స్టడీస్-1) :
పరీక్ష స్వరూపం కోణంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సిలబస్ పరంగా.. హిస్టరీ, సాంస్కృతిక వారసత్వం, జాగ్రఫీ విభాగాలను పేర్కొన్నారు. వాస్తవానికి ఈ అంశాలు ప్రస్తుత విధానంలోనూ అడుగుతున్నారు. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత విధానంలో పేపర్-2లో సెక్షన్-1లో ఈ అంశాలున్నాయి.

పేపర్-5 (జనరల్ స్టడీస్-2) :
ఈ పేపర్‌ను ఇండియన్ పాలిటీ అండ్ కాన్‌స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనే మూడు విభాగాలుగా పేర్కొన్నారు. మొత్తం నూతన విధానంలో అభ్యర్థులకు కొత్తగా కనిపించే పేపర్ ఇదొక్కటే అని చెప్పొచ్చు. కారణం.. ప్రస్తుత విధానం లో పాలిటీ, కాన్‌స్టిట్యూషన్ అంశాలను మెయిన్ ఎగ్జామినేషన్‌లో చదువుతున్నప్పటికీ.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ విభాగాలు మాత్రం కొత్తవే. అభ్యర్థుల్లోని పరి పాలనా దక్షత, విధుల పరంగా అవసరమైన నైతిక విలువల గురించి పరిశీలించే కోణంలో వీటిని పొందుపర్చినట్లు చెప్పొచ్చు.

పేపర్-6 (జనరల్ స్టడీస్-3):
ఈ పేపర్‌ను కూడా మూడు విభాగాలుగా (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలు)విభజించారు. ప్రస్తుత విధానంలో అభ్యర్థులు వీటిని ఇప్పటికే చదువుతున్న విషయం తెలిసిందే.

గ్రూప్-1 ప్రతిపాదిత మెయిన్ ఎగ్జామినేషన్ స్వరూపం..

పేపర్

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

సమయం

పేపర్-1

రీజనల్ లాంగ్వేజ్

13

150

3 గంటలు

పేపర్-2

ఇంగ్లిష్ లాంగ్వేజ్

10

150

3 గంటలు

పేపర్-3

ఎస్సే

3

150

3 గంటలు

పేపర్-4

జనరల్ స్టడీస్-1

25

150

3 గంటలు

పేపర్-5

జనరల్ స్టడీస్-2

25

150

3 గంటలు

పేపర్-6

జనరల్ స్టడీస్-3

25

150

3 గంటలు

మొత్తం

900


  • పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) - 100 మార్కులు.
స్థానిక పరిస్థితులపైనా..
Education News ప్రతిపాదిత సిలబస్‌ను జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్‌కు సైతం అభ్యర్థులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో రూపొందించినది. గ్రూప్-1 ఔత్సాహికులు ఏ మాత్రం ఆందోళన చెందక్కర్లేదు. మొత్తం సిలబస్‌లో 30 శాతం సిలబస్‌ను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొందుపరిచే వెసులుబాటు రాష్ట్ర సర్వీస్ కమిషన్లకు ఇచ్చారు. అయితే నా సలహా ఏంటంటే.. గ్రూప్-1 స్థాయి అధికారికైనా.. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆయా అంశాలపై అవగాహన ఉండటం అవసరమనే విషయాన్ని గుర్తించాలి.
- ప్రొఫెసర్ పి.ఉదయ్ భాస్కర్, చైర్మన్, ఏపీపీఎస్సీ.
Published date : 06 Feb 2018 02:34PM

Photo Stories