Skip to main content

TSPSC Group 2 Application Link : 783 గ్రూప్‌–2 పోస్టులకు ద‌ర‌ఖాస్తు ప్రారంభం.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC).. 18 ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TSPSC Group 2 Jobs
TSPSC Group 2 Application

రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కీలకమైన 783 గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ జారీ చేసిన విష‌యం తెల్సిందే. 2023 జనవరి 18వ తేదీ (బుధ‌వారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ‌మైంది. ఈ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ చివ‌రి తేదీ ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 

☛ TSPSC Group 2 Online Apply Link ( Click Here )
ఈ ఉద్యోగ ఖాళీల్లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగం పరిధిలో 165 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులున్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 126 మండల్‌ పంచాయత్‌ ఆఫీసర్‌ పోస్టులు, భూ పరిపాలన శాఖలో 98 నయాబ్‌ తహసీల్దార్‌ పోస్టులున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండోసారి భర్తీ చేస్తున్న గ్రూప్‌–2 పోస్టుల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున కసరత్తు ముమ్మరం చేస్తున్నారు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 కేటగిరీలో.. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు ఇవే..

పోస్టు

ఖాళీలు

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3

11

అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌

59

నాయబ్‌ తహసీల్దార్‌

98

సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2

14

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌)

63

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌

09

మండల పంచాయత్‌ ఆఫీసర్‌

126

ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

97

అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (చేనేత)

38

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (జీఏడీ)

165

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (శాసనసభ సచివాలయం)

15

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌)

25

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (లా)

07

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (రాష్ట్ర ఎన్నికల కమిషన్‌)

02

డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 జువెనైల్‌ సర్వీస్‌

11

అసిస్టెంట్‌ బీసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌

17

అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

09

అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

17

గ్రూప్-2 రాతపరీక్ష విధానం ఇలా.. :

పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు సమయం (గంటలు) మార్కులు
1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ 150  2 1/2 150
2 హిస్టరీ, పాలిటీ     అండ్‌ సొసైటీ                        
  1. భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర
  2. భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం (ఓవర్‌ వ్యూ)
  3. సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
150 2 1/2 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌                        
  1. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
150 2 1/2 150
4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం                        
  1. తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970)
  2. మద్దతు కూడగట్టే దశ (1971–1990)
  3. తెలంగాణ ఏర్పాటు దిశగా..(1991–2014)
150 2 1/2 150
Published date : 18 Jan 2023 05:30PM

Photo Stories