APPSC Group-1 Mains: మెయిన్స్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి... ఇలా రాస్తే ఎక్కువ మార్కులు గ్యారంటీ
ఎస్సేలను ఎలా ప్రారంభించాలి, సమయపాలన ఎలా మెయింటెన్ చేయాలి అన్న సందేహాలను 2022 గ్రూప్ 1 ర్యాంకర్ కృష్ణానాయక్ తీర్చారు. అవేంటే ఇక్కడ తెలుసుకుందామా..!
పరీక్ష 3 గంటలు ఉంటుంది. మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయి. సో ప్రతి గంటకు 5 ప్రశ్నలకు జవాబులు రాసేలా ప్లాన్ చేసుకోవాలి. మనం ప్రశ్నపత్రం చూడగానే మనకు వచ్చిన వాటినే రాస్తాం కాబట్టి ఫస్ట్ ప్రశ్నకు 20 నిమిషాలు తీసుకున్నా మిగిలిన వాటిని త్వరగా రాసేలా ప్లాన్ చేసుకోవాలి. గంట గంటకు చెక్ చేసుకుంటూ ఉండాలి.
చదవండి: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ సారి కొత్త విధానంలో..
ప్రతీ ఎస్సేని మినిమం నాలుగు పేజీలైతే ఉండాలి. పేజీకి 800 నుంచి 900 పదాలు ఉండేలా చూసుకోవాలి. ఐదారు, పేజీలు రాస్తే మంచిది. మొదట మనం బాగా వచ్చిన ప్రశ్నతో ప్రారంభించాలి. ఒక ప్రశ్నకు జవాబు ఎలా మొదలు పెట్టాలి అన్న విషయాన్ని 10 నుంచి 15 సెకన్లలో డిసైడ్ అవ్వాలి. ఇంట్రడక్షన్ బాగా రాయాలి. అప్పుడే ఎస్సేకి బలం వస్తుంది.
డెఫినెషన్, స్టాటిస్టికల్ డేటా, క్వొటేషన్ ... ఇలాంటి వాటితో ప్రారంభిస్తే మంచి ఇంప్రెషన్ వస్తుంది. ప్రశ్నాపత్రంలో ఏ ప్రశ్న బాగా వస్తే దాన్నే ఎంచుకోవాలి. 15 ప్రశ్నలను కచ్చితంగా ఆన్సర్ చేయాలి. అప్పుడే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంది.
లాస్ట్ 10 రోజులుగా న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే ప్రశ్నపత్రం సిద్ధమై ఉంటుంది. కొత్తగా పేపర్ చదవడం వల్ల కొత్త విషయాలపై అవగాహన లేనట్లయితే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. సోషియో ఎకనమిక్ సర్వేను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఏపీ బడ్జెట్ పై పూర్తి అవగాహన ఉండాలి.
లాస్ట్ ఇయర్ నుంచి లా అండ్ ఎథిక్స్ యాడ్ అయ్యింది. ఇది సబ్జెక్ట్ కూడా తక్కువే. కాబట్టి ఉదాహరణలు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటే మంచింది. ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్ ద్వారా మనం చెప్పాలనుకుంది చెప్పేయాలి.
పరీక్ష రాసే రోజు ఎలాంటి కొత్త విషయాలు చదవకూడదు. గణాంకాలు, క్వోట్స్, మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌ను రివిజిన్ చేసుకోవాలి. అలాగే ఎస్సే రైటింగ్ కాబట్టి ఒక్కసారిగా పరీక్షకు వెళ్లాక మన చేయి మనకు సహకరించేందుకు సమయం పడుతుంది. దీన్ని అధిగమించేందుకు పరీక్షకు ముందు ఒకటి, రెండు పేజీల్లో ఎస్సే ప్రాక్టీస్ చేసి వెళ్లడం మంచిది. పరీక్షకు మినిమం రెండు, మూడు పెన్నులు తీసుకెళ్లాలి. నీటిని అక్కడే ఇస్తారు. కానీ, మనం మన బాటిల్ తీసుకెళ్లడం మంచింది. పరీక్ష ఒక వారం పాటు ఉంటుంది కాబట్టి పెన్నులు, పెన్సిళ్లు, ఐడీ ప్రూఫ్ ఇవన్నీ ఒకే చోట ఉంచుకోవడం మంచిది.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ |ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్
ఒక ప్రశ్న తర్వాత కొత్త ప్రశ్నను అదే పేపర్‌లోనే కంటిన్యూ చేయొచ్చు. ఒక నాలుగైదు లైన్లు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే పేజీని వదిలేసి మరో పేజీలో ప్రారంభించవచ్చు.
ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌ను ఎలాంటి పరిస్థితుల్లో అండర్‌లైన్ చేయకూడదు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ స్పష్టంగా చెప్పింది. మీరు అండర్‌లైన్ చేస్తే వాటిని ఇన్‌వాలిడ్ చేస్తారు.
సబ్ హెడ్డింగ్స్ పక్కా రాయాలి. ప్రశ్నను బట్టి మన సబ్ హెడ్డింగ్స్ ఉండాలి. పేపర్ కరెక్షన్ చేసే వారికి సబ్‌హెడ్డింగ్స్ పెట్టడం వల్ల మంచి ఇంప్రెషన్ వస్తుంది.
జవాబు రాసే సమయంలో ఓన్లీ గణాంకాలు మాత్రమే కాకుండా ఉదాహరణలు, కరెంట్ ఈవెంట్స్‌ను యాడ్ చేయడం వల్ల మార్కులు పెరిగే అవకాశం ఉంది. కంక్లూజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ముగింపు స్పష్టంగ ఉండేలా చూసుకోవాలి.
హిస్టరీ రాసేటప్పుడు.. ఏదైనా రాజు పరిపాలించే సమయంలో అక్కడ ఉన్న కట్టడాలు, లిటరేచర్, అడ్మినిస్ట్రేషన్ గురించి రాయాలి. అలాగే అతని రాజ్యం ఎంత వరకు ఉంది.. దాన్ని బౌండరీస్ రాస్తే మరింత మంచింది. అతని కాలంలో మంచి కట్టడాలు ఉంటే వాటిని చిన్నగా డయాగ్రమ్ రూపంలో చూపిస్తే ఇంకా మంచింది. క్యాపిటల్, కట్టడాల గురించి రాయడం మంచింది.
ఆర్ కృష్ణానాయక్, డిప్యూటీ కలెక్టర్, ట్రైనింగ్ ఇన్ అనంతపురం
- 2022లో డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక