TS Group 4 Jobs Details: గ్రూప్–4 లో పోస్టుల వివరాల కోసం... క్లిక్ చేయండి
ఆ కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని, రేయింబవళ్లు కష్టపడుతుంటారు. ఇలాంటి వారికోసం తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్లీ గవర్నమెంట్ జాబ్ అంటే... కష్టమనే చెప్పాలి. కాబట్టి కష్టపడి, ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగాన్ని ఒడిసి పట్టుకోవచ్చు.
గ్రూప్ –4 పోస్టులు ఇలా....
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 9,168 గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నవంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్, ఐ అండ్ క్యాడ్‌లో జూనియర్ స్టెనో, డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్‌లో టైపిస్ట్, జూనియర్ స్టెనో, రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఐ అండ్ క్యాడ్‌లో జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ శాఖలో టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, పంచాయతీ రాజ్‌లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో (జేఏ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో జూనియర్ అసిస్టెంట్, అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్.
రెవెన్యూ శాఖలోనే అత్యధికం...
గ్రూప్–4 ఉద్యోగాల్లో ప్రధానంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. అత్యధికంగా 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి.