Skip to main content

TSPSC Group 4 Hall Ticket 2023: గ్రూప్-4 హాల్ టికెట్లు వ‌చ్చేశాయ్‌... డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

తెలంగాణ‌లో గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి జులై 1న నిర్వహించనున్న రాతపరీక్షలో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్‌పీఎస్సీ తప్పనిసరి చేయనుంది. ఉదయం జరిగే పేపర్‌-1, మధ్యాహ్నం జరిగే పేపర్‌-2లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్‌ పత్రాల్ని అందజేస్తారు.
గ్రూప్-4 హాల్ టికెట్లు వ‌చ్చేశాయ్‌
గ్రూప్-4 హాల్ టికెట్లు వ‌చ్చేశాయ్‌

గ్రూప్‌-4 రాతపరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యల అమల్లో భాగంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టులకు జులై 1న నిర్వహించనున్న రాతపరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రాల్లో అవసరమైన పరీక్ష కేంద్రాలను గుర్తించిన కమిషన్, పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించింది. 

TSPSC : గ్రూప్ 4 నోటిఫికేష‌న్‌... ప్రిప‌రేష‌న్ ప్లానింగ్ కోసం క్లిక్ చేయండి

అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారు. గతేడాది నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో బయోమెట్రిక్‌ అమలు చేశారు. కానీ, ఆ సమయంలో 100 శాతం అభ్యర్థుల బయోమెట్రిక్‌ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమాయానికి బయోమెట్రిక్‌ తీసుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. 

tspsc

ఈ ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు అభ్యర్థుల్లో అపోహలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. హాజరుపట్టీలో ఫొటోను.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. భారీసంఖ్యలో అభ్య‌ర్థులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు కమిషన్‌ స్పష్టం చేసింది. 

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

tspsc

ఓఎంఆర్‌ పత్రాల్లో అభ్యర్థులు హాల్‌టికెట్‌ నంబరు, ప్రశ్నపత్రం కోడ్, పేరు, సంతకం పేర్కొనాల్సి ఉంటుంది. https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

నేటి నుంచి హాల్‌టికెట్లు..
గ్రూప్‌-4 పరీక్ష హాల్‌టికెట్లు జూన్‌ 24 (శనివారం) నుంచి అందుబాటులో ఉండ‌నున్నాయి. జులై 1న పేపర్‌-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. పేపర్ - I జనరల్ స్టడీస్, పేపర్ - II - సెక్రటేరియల్ ఎబిలిటీస్ 

                                                       హాల్ టికెట్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Published date : 24 Jun 2023 01:27PM

Photo Stories