TSPSC Group 3 Application Edit Option : మీ గ్రూప్-3 దరఖాస్తులో తప్పులు ఉన్నాయా..? అయితే ఎడిట్ చేసుకునేందుకు చివరి తేదీ ఇదే..
గ్రూప్-3 దరఖాస్తులోని తప్పులను ఆగస్టు 16వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చును. ముఖ్యంగా అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే ఫైనల్ టేటాగా పరిగణిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
ఈ గ్రూప్ 3 పరీక్షను అక్టోబర్, నవంబర్‌లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్-3 విభాగంలో 1,375 పోస్టులకు గాను 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టు సమాచారం. మరో వారం, పది రోజుల్లో గ్రూప్-3 పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించనున్నట్టు తెలిసింది.
☛ TSPSC Group 2 & 3 New Exam Dates 2023 : గ్రూప్-2 & 3 కొత్త పరీక్ష తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..
అక్టోబర్ నెలలోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్‌తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రూప్-3 పరీక్ష తేదీలను పరిశీలిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికలలోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 పరీక్షావిధానం ఇదే..
మొత్తం మార్కులు: 450
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |