Skip to main content

APPSC 720 Group-2 Jobs Notification 2023 : 720 గ్రూప్–2 ఉద్యోగాలకు ప్ర‌భుత్వం ఆమోదం.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న గ్రూప్‌-2 అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏక్ష‌ణంలోనై నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
APPSC Group 2 Jobs Increased News Telugu, government news
APPSC 720 Group2 Jobs 2023

నిరుద్యోగులకు వీలైనంత మేలు చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనకి అనుగుణంగా గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇంతకు ముందే 508 పోస్టులకు ఆమోదం ప్రభుత్వం తెలుపగా.., తాజాగా అద‌నంగా మ‌రో 212 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు తెలిపారు. దీంతో మొత్తం 720 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అయింది.

గ్రూప్‌-2 పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని విభాగాలను మరోసారి ఖాళీల వివరాలని తెప్పించుకున్న జీఎడీ.. పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 పోస్టులకు ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌ తదితర వివరాలు..

సిలబస్‌పై..
మరికొద్ది రోజుల్లోనే ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు రావడం ఖాయమని స్పష్టమైంది. కాబట్టి ప్రిపరేషన్‌కు ఉపక్రమించే ముందు అభ్యర్థులు సిలబస్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. తాము పోటీ పడదలచుకుంటున్న పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను లోతుగా పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.

గ్రూప్ 2 ప‌రీక్షావిధానం ఇలా..
గ్రూప్‌–2 పరీక్షను రెండు దశలుగా(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామ్‌) నిర్వహిస్తారు. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి 1:50 నిష్పత్తిలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.

80 శాతం ఉమ్మడి అంశాలే.. 
గ్రూప్‌–1, గ్రూప్‌–2 సిలబస్‌లో దాదాపు 80 శాతం ఉమ్మడి అంశాలే! కాబట్టి అభ్యర్థులు గ్రూప్‌–1 ఓరియెంటేషన్‌తో, డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో ప్రిపరేషన్‌ సాగిస్తే... గ్రూప్‌–2 సిలబస్‌పైనా పట్టు లభించే అవకాశం ఉంది. ఆయా టాపిక్‌లను చదివేటప్పుడు కోర్‌ సబ్జెక్ట్‌ను విస్తృతంగా అన్ని కోణాల్లో చదువుతూ.. సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకోవాలి. తద్వారా ఏకకాలంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2ల్లో రాణించేందుకు వీలవుతుంది. 

ఈ అంశాలపై..
గ్రూప్స్‌ అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌కు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో పట్టు సాధించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి సారించాలి. దీంతోపాటు జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి అవగాహన పెంచుకోవాలి.


గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రతి అంశాన్ని చదివేటప్పుడు అన్వయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలు సమ్మిళితంగా ఉండే ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. అదే విధంగా చదివే సమయంలోనే రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. నిరంతరం తమ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు మోడల్‌ టెస్ట్స్‌కు హాజరు కావడం మేలు చేస్తుంది.

☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ప్రీవియస్‌ పేపర్స్‌ను..
గ్రూప్స్‌-2 అభ్యర్థులు ప్రిపరేషన్‌ ప్రారంభించే ముందు గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాల ద్వారా పరీక్షలో సదరు అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుస్తుంది. ఆయా టాపిక్స్‌పై తమకున్న పట్టు, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన విషయాల్లోనూ స్పష్టత లభిస్తుంది.

☛ APPSC Group-1 First Ranker Rani Susmita Interview : గ్రూప్‌-1 ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఇలా చ‌దివితే..

Published date : 21 Oct 2023 09:47AM

Photo Stories