APPSC Group 1 Ranker Success : కార్మికుడిగా పనిచేస్తూనే.. కొడుకుని చదివించాడు.. నేడు గ్రూప్-1 ఆఫీసర్‌గా..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్–1లో మంచి ర్యాంక్ సాధించి ఉద్యోగానికి ఎంపికైన వెంకటరమణ మూర్తి సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని నాగళ్లవలసకి చెందిన అట్టాడ అప్పలనాయుడు ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు గరివిడి ఫేకర్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కుమారుడు వెంకటరమణ మూర్తి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ చూపడంతో ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆయన గ్రూపు–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు.
APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?
ఎడ్యుకేషన్ :
వెంకటరమణ మూర్తి గరివిడిలోని గోదావరి స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో పుటపర్తిలోని శ్రీ సత్యసాయి విద్యాలయాల్లో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు.
ఈ లక్ష్యంతో కోసమే..
సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో మూడేళ్లుగా శిక్షణ తీసుకున్నారు. మొదటి ప్రయత్నం విఫలం అయిన నిరాశ చెందకుండా చదువుతున్నారు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైనా చేరలేదు. సివిల్స్‌లో రాణించి ఐఏఎస్ అవ్వాలన్నదే అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు అప్పలనాయుడు, పద్మావతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Success Story: గ్రూప్-1లో టాప్ ర్యాంక్ కొట్టానిలా..
Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..