APPSC Group 1: గ్రూప్–1లో ర్యాంకు సాధించిన కె. ఉదయపావని
నెల్లిమర్ల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉన్నత ఉద్యోగాలు సాధించారు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించిన కెల్ల ఉదయపావని నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.
ఇవీ చదవండి: APPSC Group 1లో బొగ్గరం యువకుడి సత్తా
నెల్లిమర్ల మండలంలోని మారుమూల గ్రామమైన అలుగోలుకు చెందిన పావని తండ్రి నారాయణప్పలనాయుడు రేషన్ షాపు డీలర్‌కాగా, తల్లి భారతి అంగన్‌వాడీ టీచర్. పావని పదో తరగతి వరకు గ్రామంలోని ఉన్నత పాఠశాలలోనే విద్య నభ్యసించారు. పదో తరగతి టాపర్‌గా నిలిచి విశాఖలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. అనంతరం కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసి.. ఉద్యో గ సాధనలో నిమగ్నమయ్యారు. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న పావని ఆ దిశగా 2022 లో పరీక్ష రాసి కేవలం 14 మార్కుల కటాఫ్‌తో ఉద్యోగానికి దూరమయ్యారు.. గ్రూప్–1 పరీక్షలో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్ సాధనకు శిక్షణ పొందుతున్నారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ... తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికకావడం సంతోషంగా ఉందని, సివిల్స్‌లో సత్తాచాటి కలెక్టర్ కావడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story
ఇవీ చదవండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Success Story