Skip to main content

TSPSC: గ్రూప్‌–1 దరఖాస్తు సవరణ గడువు పొడిగింపు

TSPSC
గ్రూప్‌–1 దరఖాస్తు సవరణ గడువు పొడిగింపు

గ్రూప్‌–1 దరఖాస్తులో సవరణ (ఎడిట్‌) అవకాశాన్ని జూలై 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు Telangana State Public Service Commission (TSPSC) జూలై 21న ఒక ప్రకటనలో తెలిపింది. ఎడిట్‌ ఆప్షన్‌ జూలై 21 సాయంత్రం 5 గంటలకు ముగియగా.. క్షేత్రస్థాయినుంచి వచ్చిన వినతులను పరిశీలించిన TSPSC ఆ గడువును 28వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కమిషన్‌ సూచించింది.

Published date : 22 Jul 2022 05:02PM

Photo Stories