ఆస్ట్రేలియన్ ఓపెన్-2019
Sakshi Education
జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత. 2019, జనవరి 26న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో ఆమె పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను 7-6, 5-7, 6-4 స్కోరుతో ఓడించింది. 2018 యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా గెలిచిన నవోమి ఒసాకాకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో 21 ఏళ్ల ఒసాకా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకునూ కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రీడాకారిణి నవోమి ఒసాకా కావడం విశేషం.
సెర్బియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ కీడాకారుడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను 7వసారి గెలుచుకున్నాడు. 2019, జనవరి 27న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్‌ను 6-3, 6-2, 6-3 స్కోర్‌తో వరుస సెట్లలో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 31 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాక ఆయనకు ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2018లో అతడు వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఈ విజయంతో ఆయన పీట్ సంప్రాస్ (14 టైటిళ్లు)ను అధిగమించాడు. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన క్రీడాకారుల జాబితాలో రోజర్ ఫెదరర్ (20), రఫెల్ నాదల్ (17) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.
మాదిరి ప్రశ్నలు:
1. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ైటె టిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) సిమోనా హాలెప్
బి) పెట్రా క్విటోవా
సి) కరోలినా ప్లిస్కోవా
డి) నవోమీ ఒసాకా
సమాధానం: డి
2. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎవరిని ఓడించి నొవాక్ జొకోవిచ్ టైటిల్ సాధించాడు?
ఎ) కీ నిషికోరి
బి) మిలోస్ రౌనిక్
సి) రఫెల్ నాదల్
డి) రోజర్ ఫెదరర్
సమాధానం: సి
మాదిరి ప్రశ్నలు:
1. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ైటె టిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) సిమోనా హాలెప్
బి) పెట్రా క్విటోవా
సి) కరోలినా ప్లిస్కోవా
డి) నవోమీ ఒసాకా
సమాధానం: డి
2. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎవరిని ఓడించి నొవాక్ జొకోవిచ్ టైటిల్ సాధించాడు?
ఎ) కీ నిషికోరి
బి) మిలోస్ రౌనిక్
సి) రఫెల్ నాదల్
డి) రోజర్ ఫెదరర్
సమాధానం: సి
Published date : 04 Mar 2019 03:02PM