Skip to main content

వివిధ శాస్త్రాలు - అధ్యయనాలు

సైటాలజీ

కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం

అనాటమీ

మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం

ఎకాలజీ

మొక్కలు, జంతువులకు వాటి పరిసరాలతో ఉండే సంబంధాల గురించి వివరించే అధ్యయన శాస్త్రం

ఆర్థిక వృక్షశాస్త్రం (ఎకనమిక్ బోటనీ)

మానవులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనమిక్ బోటనీ అంటారు ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలు, ఫలాలు, కూరగాయల వంటి వాటి అధ్యయన శాస్త్రం

ఎంబ్రియాలజీ

పిండాభివృద్ధి శాస్త్రం

జెనెటిక్స్

జన్యువుల లక్షణాల అధ్యయన శాస్త్రం

పేలినాలజీ

పుష్పించే మొక్కల పరాగ రేణువుల అధ్యయనం

పేలియోబోటనీ

వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం

టాక్సానమీ

మొక్కలు, జంతువుల గుర్తింపు, వాటి వర్గీకరణ వంటి వాటి అధ్యయన శాస్త్రం

మైకాలజీ

వివిధ రకాల ఫంగస్‌ల అధ్యయన శాస్త్రం

పాథాలజీ

మొక్కలు, జంతువుల వ్యాధుల అధ్యయన శాస్త్రం

ఫైకాలజీ

ఆల్గేల అధ్యయనం దీన్నే ఆల్గాలజీ అంటారు

బ్రయాలజీ

బ్రయోఫైట్స్ అనే మొక్కల అధ్యయనం (ఉదా: లివర్‌వార్ట్స్, మాస్)

టెరిడాలజీ

ఫెర్న్స్ వంటి టెరిడోఫైట్ మొక్కల అధ్యయన శాస్త్రం

జువాలజీ

ఏకకణ జీవి అమీబా నుంచి మానవుని వరకు అన్ని జంతువుల అధ్యయన శాస్త్రం

హిస్టాలజీ

కణజాల శాస్త్రం

ఎండోక్రైనాలజీ

అంతఃస్రావిక వ్యవస్థ అధ్యయనం (జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ల అధ్యయనం)

ఎంటమాలజీ

కీటకాల అధ్యయన శాస్త్రం

పేలియోజువాలజీ

జంతు శిలాజాల అధ్యయన శాస్త్రం

ఆర్నిథాలజీ

పక్షుల అధ్యయన శాస్త్రం

హెల్మింథాలజీ

పరాన్నజీవ పురుగుల అధ్యయన శాస్త్రం

లెపిడోటెరాలజీ

సీతాకోకచిలుకలు, మాత్‌ల అధ్యయన శాస్త్రం

లిమ్నాలజీ

సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం

మయాలజీ

కండరాల అధ్యయన శాస్త్రం

ఓఫియాలజీ

పాముల అధ్యయన శాస్త్రం

మైక్రోబయాలజీ

సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం

బాక్టీరియాలజీ

బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం

వైరాలజీ

వైరస్‌ల అధ్యయన శాస్త్రం

ఆగ్రోస్టాలజీ

గడ్డి అధ్యయన శాస్త్రం

హైడ్రాలజీ

భూగర్భ జలాల అధ్యయన శాస్త్రం

హైడ్రోపోనిక్స్

(నేల సహాయం లేకుండా) మొక్కలను నీటిలోనే పెంచటాన్ని అధ్యయనం చేసే శాస్త్రం

హార్టీకల్చర్

తోటల పెంపకం

ఫ్లోరీకల్చర్

పుష్పాల పెంపకం

పెడాలజీ

నేలల అధ్యయన శాస్త్రం

విటికల్చర్

ద్రాక్షతోటల పెంపకం

సిల్వీకల్చర్

కలపనిచ్చే చెట్ల పెంపకం

ఇక్తియాలజీ

చేపల అధ్యయన శాస్త్రం

పోమాలజీ

పండ్ల మొక్కల అధ్యయన శాస్త్రం

ఒలెరీకల్చర్

కూరగాయల పెంపకం

ఎపీకల్చర్

తేనెటీగల పెంపకం

టిష్యూకల్చర్

కణజాలాల సంవర్ధనం

పిసికల్చర్

చేపల పెంపకం

వర్మికల్చర్

వానపాముల పెంపకం

కార్డియాలజీ

మానవ హృదయ నిర్మాణం, గుండెకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం

ఆఫ్త్తాల్మాలజీ

మానవుని కన్ను, నిర్మాణం, విధులు, కంటి వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం

ఇమ్యునాలజీ

మానవుని రోగ నిరోధక శక్తి అధ్యయన శాస్త్రం

డెర్మటాలజీ

మానవుని చర్మం, నిర్మాణం, విధులు, చర్మానికి వచ్చే వ్యాధులు, వాటికి చికిత్సల అధ్యయన శాస్త్రం

హెమటాలజీ

రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం

గైనకాలజీ

స్త్రీల వ్యాధుల అధ్యయన శాస్త్రం

హెపటాలజీ

కాలేయ అధ్యయన శాస్త్రం

పీడియాట్రిక్స్

చిన్నపిల్లల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం

న్యూరాలజీ

నాడీ వ్యవస్థ అధ్యయన శాస్త్రం

ఆంకాలజీ

కేన్సర్ అధ్యయన శాస్త్రం

జెరియాట్రిక్స్

వృద్ధుల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం

రుమటాలజీ

కీళ్లు, వాటికి సంబంధించిన వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం

ఆంజియాలజీ

రక్తనాళాల అధ్యయన శాస్త్రం

పల్మనాలజీ

ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రం

క్రేనియాలజీ

మానవుని పుర్రెను అధ్యయనం చేసే శాస్త్రం దీన్నే ఫ్రెనాలజీ అని కూడా అంటారు

నెఫ్రాలజీ

మూత్రపిండాల నిర్మాణం, విధులు, వాటికి సంక్రమించే వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం

క్రిమినాలజీ

నేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం

టాక్సికాలజీ

విషంపై అధ్యయనం చేసే శాస్త్రం

క్రిప్టోగ్రఫీ

రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతల అధ్యయన శాస్త్రం

ట్రైకాలజీ

మానవుని జుట్టుపై అధ్యయనం చేసే శాస్త్రం

థానటాలజీ

మరణంపై అధ్యయనం చేసే శాస్త్రం

ఆస్ట్రానమీ

ఖగోళ అధ్యయన శాస్త్రం

సిస్మాలజీ

భూకంపాల అధ్యయన శాస్త్రం

లిథాలజీ

శిలల అధ్యయన శాస్త్రం

ఓరాలజీ

పర్వతాల అధ్యయన శాస్త్రం

కాస్మోలజీ

విశ్వంపై అధ్యయనం చేసే శాస్త్రం

సెలినాలజీ

చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం

మెటియోరాలజీ

వాతావరణ అధ్యయన శాస్త్రం

పోటమాలజీ

నదుల అధ్యయన శాస్త్రం

అకౌస్టిక్స్

ధ్వని అధ్యయన శాస్త్రం

ఆప్టిక్స్

కాంతి అధ్యయన శాస్త్రం

క్రయోజెనిక్స్

అత్యల్ప ఉష్ణోగ్రతల నియంత్రణ అధ్యయన శాస్త్రం

థియోలజీ

వివిధ మతాల అధ్యయన శాస్త్రం

సోషియాలజీ

సమాజ అధ్యయన శాస్త్రం

డెమోగ్రఫీ

మానవ జనాభా అధ్యయన శాస్త్రం (జననాలు, మరణాల వంటి గణాంకాలు)

పెడగాగీ

బోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం

ఫిలాటలీ

స్టాంపుల సేకరణ

న్యూమిస్‌మ్యాటిక్స్

నాణేల అధ్యయన శాస్త్రం

లెక్సికోగ్రఫీ

నిఘంటువుల అధ్యయన శాస్త్రం

ఎటిమాలజీ

పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం

న్యూమరాలజీ

సంఖ్యా శాస్త్రం

సెఫాలజీ

ఎన్నికల అధ్యయన శాస్త్రం

ఫొనెటిక్స్

భాషా ఉచ్ఛరణ అధ్యయన శాస్త్రం

Published date : 09 Mar 2013 03:31PM

Photo Stories