Skip to main content

ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడో?

సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశ సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో ‘వారుణాస్త్ర’ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) భారత నౌకాదళానికి అప్పగించింది.

నవంబర్ 21న విశాఖలోని బీడీఎల్‌ని సందర్శించిన డీఆర్‌డీవో చైర్మన్ డా.జి.సతీష్‌రెడ్డి చేతుల మీదుగా వారుణాస్త్రని నేవీకి అప్పగించారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కి చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీ... వారుణాస్త్రని డిజైన్ చేయగా, బీడీఎల్ దీన్ని తయారు చేసింది.

వారుణాస్త్ర విశేషాలు...

  • యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్ టార్పెడోను సముద్రంలో దాగి ఉన్న శత్రు దేశపు జలాంతర్గామిపై ప్రయోగించవచ్చు.
  • 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.
  • ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడోగా వారుణాస్త్ర వినుతికెక్కింది.
  • బరువు: 1,500 కిలోలు
  • పొడవు: 7 నుంచి 8 మీటర్లు
  • వ్యాసం: 533 మి.మీ.
  • వార్‌హెడ్ బరువు: 250 కిలోలు
  • ఆపరేషన్ పరిధి: 40 కి.మీ.
  • ఎంత లోతులో ఉన్న సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేస్తుంది: 400 మీటర్లు
  • నీటిలో ఎంత వేగంతో దూసుకెళ్తుంది: గంటకు 74 కి.మీ.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత నౌకాదళానికి వారుణాస్త్ర టార్పెడో అప్పగింత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)
ఎక్కడ : బీడీఎల్, విశాఖపట్నం
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు...
Published date : 23 Nov 2020 05:56PM

Photo Stories