Skip to main content

ప్రపంచానికి పరిచయమైన తొలి కంప్యూటర్‌ పేరు?

ప్రపంచంలోని తొలి కంప్యూటర్‌ పేరు... ఎలక్ట్రానిక్‌ న్యూమరికల్‌ ఇంటిగ్రేటర్‌ అండ్‌ కంప్యూటర్‌(ఇనియాక్‌). 1946 ఫిబ్రవరి 15న తొలిసారి ఇది ప్రపంచానికి పరిచయమైంది.
అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని మూర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో 1943లో ఇనియాక్‌ నిర్మాణం మొదలైంది. ‘ప్రాజెక్ట్‌ పీఎక్స్‌’ పేరుతో అమెరికన్‌ మిలటరీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలు దీని తయారీని చేపట్టాయి. డాక్టర్‌ జాన్‌ డబ్ల్యూ మాచ్లీ, జే.ప్రెస్పర్‌ ఎకర్ట్‌ జూనియర్‌ల ఆధ్వర్యంలో సిద్ధమైంది.

ఇనియాక్‌ విశేషాలు
  • బరువు: 27 టన్నులు
  • ఆక్రమించే స్థలం 1800 చదరపు అడుగులు
  • తయారీకైన ఖర్చు ఈ రోజు(2021, మార్చి 1) విలువలో దాదాపు రూ.53 కోట్లు.
  • ఇది మనకు పరిచయమై 75 ఏళ్లు అవుతోంది.
  • ఎనభై అడుగుల పొడవులో యూ ఆకారంలో తయారైన ఇనియాక్‌లో మొత్తం 18,800 రేడియోవాల్వ్‌లు, వ్యాక్యూమ్‌ ట్యూబ్‌లు ఉండేవి.
  • క్షిపణుల ప్రయాణ మార్గాన్ని లెక్కించి ఇవ్వడం ఈ తొలితరం కంప్యూటర్‌ ప్రధాన లక్ష్యం.
  • ఇనియాక్‌ పనిచేసేందుకు ఏకంగా 150 కిలోవాట్స్‌/గంటల విద్యుత్తు అవసరమయ్యేది.
  • కే మెక్‌నల్టీ, బెట్టీ జెన్నింగ్స్, బెట్టీ స్నైడర్, మార్లిన్‌ వెస్కాఫ్, ఫ్రాన్‌ బిలాస్, రూథ్‌ లిచెటర్‌మ్యాన్‌ అనే మహిళలు దీనికి ప్రోగ్రామింగ్‌ను చేసేవారు. ప్రపంచంలోనే తొలి ప్రోగ్రామర్లు వీరే.
  • ప్రస్తుతం ఇనియాక్‌ను ముక్కలు ముక్కలుగా చేసి పెన్సిల్వేనియా వర్సిటీతోపాటు లండన్‌లోని స్మిత్‌సోనియన్‌ సైన్స్‌ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచారు.
Published date : 02 Mar 2021 06:11PM

Photo Stories