పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం విజయవంతం
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏప్రిల్ 1న ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ ప్రయోగం ద్వారా భారత్‌కి చెందిన ఎమిశాట్ (ఈఎంఐశాట్) అనే మిలటరీ ఉపగ్రహంతోపాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. 4స్ట్రాపాన్ బూస్టర్లతో చేసిన ఈ ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ క్యూఎల్ అని పేరుపెట్టారు. పీఎస్‌ఎల్‌వీ-సీ45 రాకెట్‌లో నాలుగోదశ(పీఎస్-4) తో కొత్త ప్రయోగం చేశారు. రెండుసార్లు ఆర్బిట్ చేంజ్ అనే పేరుతో ఈ కొత్త ప్రయోగాన్ని నిర్వహించారు.
ప్రయోగం జరిగిన తీరు...
పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగంలో భాగంగా 436 కిలోల బరువు కలిగిన ఎమిశాట్ ఉపగ్రహాన్ని భూమికి 748 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 504 కిలోమీటర్ల ఎత్తులో 14 ఉపగ్రహాలను, 508 కిలోమీటర్ల ఎత్తులో మరో 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. మొత్తంగా మూడు రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. 28 విదేశీ ఉపగ్రహాల్లో 24 అమెరికాకి చెందిన వి కాగా మిగిలిన నాలుగు ఉపగ్రహాలు లిథువేనియా, స్విట్జర్లాండ్, స్పెయిన్ కి చెందినవి ఉన్నాయి.
220 కిలోలు బరువు గల అమెరికాకు చెందిన ఫ్లోక్-4ఏ పేరుతో 20 చిన్న ఉపగ్రహాలు, లీమూర్ పేరుతో మరో 4 చిన్న ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఎం-6పీ, బ్లూవాకర్-1 అనే రెండు చిన్న తరహా ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆో్టక్రార్ట్-1 ఉపగ్రహం, స్పెయిన్‌కు చెందిన ఎయిస్ టెక్‌శాట్ అనే ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ45 రాకెట్ కక్ష్యలోకి మోసుకెళ్లింది.
రాడార్లను గుర్తించే ఎమిశాట్...
పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగంలో ప్రధాన ఉపగ్రహమైన ఎమిశాట్ (ఈఎంఐశాట్)కు శత్రు దేశాల రాడార్లు, సెన్సర్లను గుర్తించే సామర్థ్యం ఉంది. 436 కిలోల బరువైన ఎమిశాట్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. 748 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఎమిశాట్ సాయంతో శత్రు దేశాల రాడార్లను పసిగట్టడంతోపాటు దానికి తగ్గట్టుగా దేశ భద్రతా చర్యలు చేపట్టొచ్చు. ఈ తరహా ఉపగ్రహాన్ని భారత్ చేయడం ఇదే ప్రథమం.
పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం ద్వారా షార్ కేంద్రం నుంచి 71వ ప్రయోగాన్ని, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సిరీస్‌లో 47వ ప్రయోగాన్ని, పీఎస్‌ఎల్‌వీ-క్యూఎల్ సిరీస్‌లో తొలి ప్రయోగాన్ని ఇస్రో చేపట్టినట్లయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీహరికోట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 08 Apr 2019 04:29PM