Skip to main content

నాసా రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ ఏ గ్రహశకలంపై దిగింది?

నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ‘ఒసిరిస్ రెక్స్’ విజయవంతంగా ‘బెన్నూ’ గ్రహశకలంపై వాలింది.
2020, అక్టోబర్ 21న ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఒసిరిస్ రెక్స్‌ను గ్రహశకలంపై దింపారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో బెన్నూ గ్రహశకలం ఉంది.

సుమారు పన్నెండేళ్లుగా...
  • నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై ఒసిరిస్ రెక్స్ వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది.
  • ఓ మినీ వ్యాన్ అంత సైజుండే ఒసిరిస్ 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది.
  • ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు.

సౌర కుటుంబ రహస్యాలు...
బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : బెన్నూ గ్రహశకలంపై దిగిన నాసా అంతరిక్ష నౌక
ఎప్పుడు : అక్టోబర్ 21, 2020
ఎవరు : ఒసిరిస్ రెక్స్
ఎందుకు : సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోనేందుకు
Published date : 22 Oct 2020 05:59PM

Photo Stories