AI: ప్రపంచంలో మొట్టమొదటి రోబో CEOగా టాంగ్ యూ
ప్రపంచంలో మొట్టమొదటి రోబో సీఈఓగా టాంగ్ యూ చరిత్ర సృష్టించింది.
Also read: Robotics Technologies: ప్రప్రథమ టీచింగ్ రోబో ‘ఈగిల్’
కంపెనీ సంస్థాగత విషయాలతోపాటు సామర్థ్యం పెంపు వ్యవహారాలను సైతం ఈ రోబో చక్కబెట్టనుంది. దాదాపు రూ. 80 వేల కోట్ల విలువ కలిగిన ఈ కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత టాంగ్ యుపై పెట్టింది యాజమాన్యం. పనుల నాణ్యతను పరిశీలించడం, అమలు వేగాన్ని పెంచడం, రోజువారీ కార్యకలాపాల్లో తీసుకునే నిర్ణయాలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో టాంగ్ యూ కీలకపాత్ర పోషించనుంది. అలాగే విశ్లేషణ సాధనంగా కూడా పనిచేయనుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల ప్రతిభను గుర్తించడం, అందరికీ సమన్యాయాన్ని వర్తింపజేయడం వంటి పనులను కూడా చేస్తుందని కంపెనీ చైర్మన్ డాక్టర్ డేజియన్ లియూ తెలిపారు. రాబోయే 30 ఏళ్లలో ఏదో ఓ రోజు బెస్ట్ సీఈవోగా ఓ రోబో టైమ్ మ్యాగజైన్ కవర్‌పేజీపై నిలవడం తథ్యమని అలీబాబా వ్యస్థాపకుడు, చైర్మన్ అయిన జాక్ మా 2017లో చెప్పాడు. ఇప్పుడు ఓ రోబో సీఈఓగా నియామకం అయ్యింది.
Also read: MIRI: అరుదైన కార్ట్‌వీల్ గెలాక్సీ
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP