కరోనా వైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణం తెలుసా..?
Sakshi Education
2019 కరోనా వైరస్‌కి సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, భారత ప్రభుత్వం ప్రశ్నలు-సమాధానం రూపంలో బులెటిన్‌ను విడుదల చేసింది. అలాగే ఎటువంటి సందేహాలు వచ్చిన 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 కాల్ చేయొచ్చు.
ప్ర. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో క్లోజ్‌గా ఉంటే ఏం చేయాలి?
జ. ఆ విషయం గుర్తించిన రోజు నుంచి 28 రోజులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేయాలి. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు ఏమైనా ఉన్నయెమో చూడాలి. కనిపిస్తే వెంటనే దగ్గరలోని హెల్త్ కేర్ సెంటర్‌కి వెళ్లి చికిత్స తీసుకోవాలి. అలాగే మీరు క్లోజ్‌గా ఉన్న ఆ పెషెంట్ వివరాలు హెల్ కేర్ వర్కర్‌కి తెలియజేయాలి.
ప్ర. నేను కచ్చితంగా 2019 నోవెల్ కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాలా?
జ. మీకు కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉంటే దగ్గరలోని హెల్త్ ఫెసిలిటికి వెళ్తే డాక్టర్స్ చెక్ చేసి, మీ ట్రావెల్ హిస్టరీ చూసి మీరు టెస్ట్ చేయించుకోవాలా లేదా అని నిర్ణయిస్తారు.
ప్ర. 2019 నోవెల్ కరోనా వైరస్ అంటే ఏమిటి ?
జ. వుహాన్, హుబే ప్రావిన్స్, చైనాలో కనుగొన్న కొత్త వైరస్ పేరు 2019 నోవెల్ కరోనా వైరస్ లేక 2019-ఎన్సీఓవీ. ఇది ఇంతకు ముందెప్పుడు వ్యాపించలేదు అందుకే దీనికి నోవెల్ అని పేరు పెట్టారు.
ప్ర. 2019 కరోనా వైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణం ఏంటి?
జ. కరోనా వైరస్‌కి కారణం ఎంటో ఇంకా గుర్తించలేదు. ఈ వైరస్‌ది పెద్ద కుటుంబం. అందులో కొన్ని మనుషుల్లో ఆరోగ్య సమస్యలకు కారణం అయితే, మరికొన్ని జంతువులకు వ్యాపిస్తాయి. కానీ ఈ వైరస్ ప్రారంభమైన చైనాలోని వుహాన్‌లో చాలామందికి సీఫుడ్, జంతువుల మాంసం తినే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. అందుకే జంతువుల నుంచి వ్యాపించి ఉంటుందని అనుకుంటున్నారు.
ప్ర. ఈ వైరస్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి?
జ.కరోనా వచ్చినప్పుడు తీవ్రమైన జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్ర. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
జ.కరోనా వైరస్ వ్యాపించే మార్గాలు గురించి పూర్తిగా తెలియలేదు. అది జంతువుల నుంచి వచ్చినప్పటికి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చాలా సులభంగా వ్యాపిస్తోంది. కానీ ఈ వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మడం, దగ్గడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తున్నట్లు అనుకుంటున్నారు.
ప్ర. కరోనా కట్టడికి భారత ప్రభుత్వం తీసుకొనే చర్యలు ?
జ. ఈ వ్యాధి గురించి సందేహాలు తీర్చడానికి ఎన్సీడీసీ, న్యూఢీల్లీలో 24 గంటల హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని ఎప్పటికప్పుడ గమనిస్తూ, దీని కట్టడికి రాష్ట్రాలను సిద్ధంగా ఉంచింది. వైరస్ దేశంలోకి వ్యాపిస్తుందని గుర్తించినప్పటి నుంచి ప్రతి సమాచారాన్ని అప్డేట్ గా ఉంచుతోంది.
ప్ర. నోవెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ అందుబాటులో ఉందా ?
జ.ప్రస్తుతానికి ఈ వైరస్‌కి ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
ప్ర. కరోనాకి చికిత్స ఉందా?
జ. కరోనాకి ప్రత్యేకంగా ఎటువంటి చికిత్స లేదు. దీని లక్షణాల నుంచి బయటపడడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం.
ప్ర. ఈ వైరస్ నుంచి నన్ను నేను ఏలా కాపాడుకోవాలి?
జ. దీనికి వ్యాక్సిన్ లేనందున వైరస్‌కి ఎక్స్పోజ్ అవకపోవడం ఒకటే మార్గం. దానికోసం..

- చైనా లాంటి దేశాలకు వెళ్లకూడదు.
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- తరచూ సబ్బుతో చేతులు కడుకోవాలి.
- దగ్గినా, తుమ్మినా నోటికి చేతులు అడ్డం పెట్టకోవాలి.
ప్ర. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో క్లోజ్‌గా ఉంటే ఏం చేయాలి?
జ. ఆ విషయం గుర్తించిన రోజు నుంచి 28 రోజులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేయాలి. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు ఏమైనా ఉన్నయెమో చూడాలి. కనిపిస్తే వెంటనే దగ్గరలోని హెల్త్ కేర్ సెంటర్‌కి వెళ్లి చికిత్స తీసుకోవాలి. అలాగే మీరు క్లోజ్‌గా ఉన్న ఆ పెషెంట్ వివరాలు హెల్ కేర్ వర్కర్‌కి తెలియజేయాలి.
ప్ర. నేను కచ్చితంగా 2019 నోవెల్ కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాలా?
జ. మీకు కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉంటే దగ్గరలోని హెల్త్ ఫెసిలిటికి వెళ్తే డాక్టర్స్ చెక్ చేసి, మీ ట్రావెల్ హిస్టరీ చూసి మీరు టెస్ట్ చేయించుకోవాలా లేదా అని నిర్ణయిస్తారు.
Published date : 31 Mar 2020 07:49PM