భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ కిల్తాన్
Sakshi Education
సముద్రపు అడుగు భాగం లో ఉన్న సబ్‌మెరైన్లనైనా గుర్తించి, మట్టుపెట్టే అధునాత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్.. భారత నౌకాదళంలో చేరింది.
ఈ మేరకు అక్టోబర్ 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డులో యుద్ధ నౌకను ప్రారంభించారు. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
ప్రాజెక్టు-28 కింద నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటీ సబ్‌మెరెన్ యుద్దనౌకల్లో ఐఎన్‌ఎస్ కిల్తాన్ మూడోది. ఐఎన్‌ఎస్ కమోర్తా, ఐఎన్‌ఎస్ కద్మత్ నౌకలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాలుగో యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరత్తి కూడా సిద్ధం కానుంది. 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో నిరుపమాన సేవలందించిన యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్‌ను 1987లో డీ కమిషన్ చేశారు. మళ్లీ ఇదే పేరుతో నౌకను సిద్ధం చేశారు.
కిల్తాన్ ప్రత్యేకతలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎన్‌ఎస్ కిల్తాన్ జలప్రవేశం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : విశాఖపట్నం
ఎందుకు : ప్రాజెక్టు - 28లో భాగంగా

- ఐఎన్‌ఎస్ కిల్తాన్.. ఐఎన్‌ఎస్ కమోర్తా కంటే శక్తిమంతమైంది. తొలిసారి పూర్తిస్థాయి కార్బన్ ఫైబర్ కాంపొజిట్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు.
- అన్ని ప్రధాన ఆయుధాల్ని, సెన్సార్లను సముద్రపు జలాల్లో ట్రయల్ రన్ నిర్వహించి.. షిప్ యార్డ్ ద్వారా నౌకాదళానికి అప్పగిస్తున్న మొదటి యుద్ధ నౌక.
- సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల సముద్ర జలాల్లో వెళ్తున్నప్పుడు సబ్ మెరైన్‌లు సైతం దీని ధ్వనితరంగాలను కనిపెట్టడం దాదాపు అసాధ్యం.
- 109 మీటర్ల పొడవు, 3,500 టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్ కిల్తాన్ 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నిరాటంకంగా 3,450 నాటికల్ మైళ్లు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం.
- భారీ టార్పెడోలు, ఏఎస్‌డబ్ల్యూ రాకెట్లు, 76 మిమీ క్యారిబర్ మీడియం రేంజ్ తుపాకీలు, క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కలిగిన 2 మల్టీ బ్యారెల్ తుపాకీలున్న సెన్సార్ సూట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.
- మిస్సైల్ డెకోయ్ రాకెట్లు, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మేజర్ వ్యవస్థ, ఎయిర్ సర్వైవలెన్‌స రాడార్ వ్యవస్థతో పాటు ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్ కూడా ఇందులో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎన్‌ఎస్ కిల్తాన్ జలప్రవేశం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : విశాఖపట్నం
ఎందుకు : ప్రాజెక్టు - 28లో భాగంగా
Published date : 16 Oct 2017 02:55PM