భారత నౌకాదళానికి చెందిన మొదటి డిస్ట్రాయర్ యుద్ధనౌక పేరు?
Sakshi Education
‘రాజ్ కరేగా రాజ్‌పుత్...’ అనే నినాదంతో నాలుగు దశాబ్దాల పాటు సాగర జలాల్ని భద్రతా వ్యవహారాల్లో పాలించిన ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ సేవల నుంచి నిష్క్రమించింది.
భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్‌ని విశాఖ నేవల్ డాక్‌యార్డులో మే 21న డీ కమిషన్ చేశారు. 41 ఏళ్ల పాటు అవిశ్రాంత సేవలు అందించిన రాజ్‌పుత్‌కు తూర్పు నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్‌పుత్ సేవలు శ్లాఘనీయమని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ (ఏబీ సింగ్) కొనియాడారు. రాజ్‌పుత్ అందించిన సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పోస్టల్ కవర్‌ని ఏబీ సింగ్ ఆవిష్కరించారు.
నాదెజ్నీ(ఆశ) పేరుతో...
నాదెజ్నీ(ఆశ) పేరుతో 1961లో సోవియట్ యూనియన్‌లోని నికోలావ్ (ప్రస్తుతం ఉక్రెయిన్ ఉంది)లో ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ నిర్మాణాన్ని చేపట్టారు. 1977, సెప్టెంబర్ 17న సేవలు ప్రారంభించగా.. 1980, మే 4న తేదీన జార్జియాలోని యూఎస్‌ఎస్‌ఆర్‌లో భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్ సమక్షంలో ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్‌గా పేరు మార్చి.. భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టి... జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి భారత సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా మారింది. మొట్టమొదటి గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్‌గా 41 ఏళ్ల పాటు రాజ్‌పుత్ సుదీర్ఘ సేవలందించింది.
పలు ఆపరేషన్లలో...
దేశాన్ని ఎల్లపుడూ సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. ఐపీకేఎఫ్‌కు సహాయంగా ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితులను పరిష్కరించేందుకు అపరేషన్ కాక్టస్, లక్షద్వీప్‌కు చెందిన క్రోవ్‌నెస్ట్ ఆపరేషన్‌లో రాజ్‌పుత్ పాల్గొంది. వివిధ సందర్భాల్లో ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో పాల్గొంది. 41 ఏళ్ల ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ ప్రస్థానంలో 31 మంది కమాండింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు.
ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ స్వరూపమిదీ...
ఆయుధ సంపత్తి

- బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి ట్రయల్ ప్లాట్‌ఫామ్‌గా రాజ్‌పుత్ సేవలందించింది.
- 2005లో ధనుష్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కూడా రాజ్‌పుత్ నుంచి ట్రాక్ చేశారు.
- 2007 మార్చిలో పృథ్వి–3 క్షిపణిని ఈ యుద్ధ నౌక నుంచి పరీక్షించారు.
ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ స్వరూపమిదీ...
- నౌక బరువు : స్టాండర్డ్–3,950 టన్నులు
- ఫుల్ లోడెడ్: 4,974 టన్నులు
- పొడవు : 142 మీటర్లు(466 అడుగులు)
- బీమ్ : 15.8 మీటర్లు(52 అడుగులు)
- లోతు : 5 మీటర్లు(16 అడుగులు)
- వేగం : 35 నాటికల్ మైళ్లు
- సామర్థ్యం : గంటకు 56 కిమీ వేగంతో 2,600 మైళ్లు ఏకధాటిగా పయనించగలదు
- సిబ్బంది : 35 మంది అధికారులు సహా 320 మంది సిబ్బంది
ఆయుధ సంపత్తి
- బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్ : 04
- ఎస్‌ఎస్ ఎన్‌డీ మిసైల్స్ : 02
- ధనుష్ బాలిస్టిక్ మిసైల్ : 01
- ఎయిర్ డిఫెన్స్ లాంఛర్స్ : 02
- 76.2ఎంఎం మెయిన్ గన్స్ : 02
- ఏకే–230 గన్స్ : 4
- యాంటీ సబ్‌మెరైన్ టార్పెడో ట్యూబ్ లాంఛర్ : 01
- హాల్ చేతక్ హెలికాఫ్టర్ : 01
- యాంటీ సబ్‌మెరైన్ మోర్టార్స్ : 02
Published date : 25 May 2021 07:24PM