Skip to main content

అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన నాసా రోవర్ పేరు?

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అత్యాధునిక రోవర్ ‘పర్సవరన్స్’ ఫిబ్రవరి 18న అరుణ గ్రహ ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది.

దీంతో మార్స్‌పై జీవం ఆనవాళ్లను నిర్ధారించేందుకు నమూనాల సేకరణకు మార్గం సుగమమైందని భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త, ప్రోగ్రామ్ ఫ్లైట్ కంట్రోలర్ డాక్టర్ స్వాతి మోహన్ ప్రకటించారు.

అట్లాస్-5 రాకెట్ ద్వారా...

  • అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో మార్స్ 2020 మిషన్‌ను నాసా చేపట్టింది.
  • మిషన్‌లో భాగంగా ఫ్లోరిడాలోని కేప్‌కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 30న అట్లాస్-5 రాకెట్ ద్వారా 6 చక్రాలతో కారు పరిమాణంలో ఉన్న ‘పెర్‌సెవరెన్స్’ రోవర్‌ను నింగిలోకి ప్రయోగించింది.
  • కెమెరాలు, మైక్రోఫోన్లు, లేజర్లు, డ్రిల్స్ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు మినీ హెలికాప్టర్‌ను రోవర్‌లో అమర్చారు.
  • ఈ రోవర్ సహాయంతో అరుణ గ్రహ నమూనాలను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని నాసా ప్రయత్నం చేస్తోంది.
  • పర్సవరన్స్ రోవర్ 203 రోజుల పాటు, 47.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సంక్లిష్ట జెజెరొ బిలం వద్ద అరుణ గ్రహంపై అడుగిడింది.


ఏడో రోవర్‌గా...

  • పెర్సీ అనే ముద్దు పేరున్న పర్సవరన్స్ రోవర్ కారు సైజులో 1,026 కేజీల బరువుంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది.
  • మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా పర్సవరన్స్ నిలిచింది.
  • ఈ రోవర్‌ను రోబోటిక్ జియాలజిస్ట్, ఆో్టబ్రయాలజిస్ట్‌గా పరిగణించవచ్చు.
  • అత్యాధునిక శాస్త్ర పరికరాలను, హై రెజొల్యూషన్ ఉన్న 3డీ కెమెరాలను, మైక్రో ఫోన్‌ను, 7, 8 అడుగుల లోతులోనూ నమూనాలను సేకరించగల సామర్థ్యాన్ని ఈ రోవర్‌లో పొందుపర్చారు.
  • జెజెరొ బిలంలోని పురాతన నదీమార్గంలో రాళ్లు, మట్టి, ఇతర నమూనాలను ఈ రోవర్ సేకరిస్తుంది.
  • పర్సవరన్స్ రోవర్ సేకరించి, ట్యూబ్స్‌లో సీల్ చేసి, అక్కడే భద్రపరిచిన నమూనాలను భూమికి తీసుకువచ్చేందుకు మరో రోవర్‌ను ప్రయోగిస్తారు.


భారతీయ సంతతి శాస్త్రవేత్త...

  • మార్స్ 2020 మిషన్‌లో భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
  • మార్స్ 2020 గెడైన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి స్వాతి ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు.
  • మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు
  • భారత్ నుంచి ఏడాది వయసులో స్వాతి మోహన్ తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన నాసా రోవర్ పేరు?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : పర్సవరన్స్
ఎక్కడ : జెజెరొ బిలం, అంగారకుడు
ఎందుకు : అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించేందుకు
Published date : 20 Feb 2021 05:57PM

Photo Stories