అణు జలాంతర్గామి అరిధామన్ ప్రవేశం
Sakshi Education
భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిహంత్ 2009 జూలై 26న ప్రారంభమైంది.
2016 అక్టోబర్ నుంచి ఇది నావికాదళంలో చేరి సేవలందిస్తోంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామన్ నవంబర్ 19న విశాఖలోని నేవల్ డాక్ యార్డులో జలప్రవేశం చేసింది.
ఆరో దేశం.. భారత్
ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణు జలాంతర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్ అరిహంత్‌తో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు కలిగిన ఆరో దేశంగా భారత్ చేరింది. అడ్వాన్‌సడ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టు కింద మొత్తం ఐదు అణు జలాంతర్గాములను నావికా దళం కోసం భారత్ నిర్మించతలపెట్టింది. ఇందులో మొదటిది ఐఎన్‌ఎస్ అరిహంత్, రెండోది అరిధామన్. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ ఐదు అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌కంటే అరిధామన్ రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిధామన్ సముద్ర సన్నాహాలు, ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేరడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఇదీ సామర్థ్యం..
బరువు : 6,000 టన్నులు
టెస్ట్ డెప్త్ : 400 మీటర్ల వరకు
వేగం : గంటకు సముద్ర ఉపరితలంపై 12 - 15 నాటికల్ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్ మైళ్లు
ఆయుధాలు : 750 - 1900 కి.మీల లక్ష్యాన్ని ఛేదించే కె - 15 ఎస్‌ఎల్‌బీఎం అణు క్షిపణులు - 24. కె- 4 ఎస్‌ఎల్‌బీఎం క్షిపణులు 8 ( 3,500 కీ.మీ.ల పరిధి)
టార్పెడోలు : 21 అడుగుల పొడవుండే టార్పెడోలు - 6

Published date : 20 Nov 2017 05:26PM