Skip to main content

విద్యా హక్కు (ఆర్‌టీఈ) చట్టం 2009లోని సెక్షన్ 29(2)(ఎఫ్) ఏమిటి?

2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మొదటి తరగతి నుండి 6 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషును విద్యా మాధ్యమంగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల‌పై స్టే ఇవ్వమ‌ని ఏపీ ప్రభుత్వం వేసిన‌ పిటిష‌న్‌ని సుప్రీంకోర్టు నిరాకరించింది.
విద్యా హక్కు (ఆర్‌టీఈ) చట్టం, 2009లోని సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం, బోధనా మాధ్యమం ఆచరణలో ఉన్నంత వరకు పిల్లల మాతృభాషలో ఉండాలి అని కోర్టు సూచించింది.

ప్రధానాంశాలు:
  • ఆర్టికల్ 29 (మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ) పౌరులందరికీ వారి భాషను పరిరక్షించుకునే హక్కును ఇస్తుంది. భాష ఆధారంగా జ‌రిగే వివక్షను నిషేధించింది.
  • ఆర్టికల్ 120 (పార్లమెంటులో ఉపయోగించాల్సిన భాష) ప్ర‌కారం పార్లమెంటు లావాదేవీల కోసం హిందీ లేదా ఇంగ్లీషు ఉప‌యోగిస్తోంది. కాని పార్లమెంటు సభ్యులకు తమ మాతృభాషలో మాట్లాడే హ‌క్కును ఇది అందిస్తుంది.
  • భారత రాజ్యాంగంలోని పార్ట్ XVII ఆర్టికల్ 343 నుంచి 351లోని అధికారిక భాషలతో వ్యవహరిస్తుంది.
  • ఆర్టికల్ 350ఏ (ప్రాథ‌మిక దశలో మాతృభాషలో బోధన కోసం సౌకర్యాలు) ప్రకారం విద్య ప్రాథ‌మిక దశలో మాతృభాషలో బోధన జ‌రిగేలా తగిన సదుపాయాలను కల్పించడం ప్రతి రాష్ట్రం, రాష్ట్రంలోని ప్రతి స్థానిక అధికారులు బాధ్యత అని చెబుతుంది.
  • ఆర్టికల్ 351 (హిందీ భాష అభివృద్ధికి డైరెక్టివ్) హిందీ భాష వ్యాప్తిని ప్రోత్సహించడం యూనియన్ విధి అని చెబుతుంది.

ఎనిమిదో షెడ్యూల్ 22 భాషలను జాతీయ అధికారిక భాషలుగా గుర్తించింది:
  • అస్సామీ
  • బెంగాలీ
  • గుజరాతీ
  • హిందీ
  • కన్నడ
  • కాశ్మీరీ
  • కొంకణి
  • మలయాళం
  • మణిపురి
  • మరాఠీ
  • నేపాలీ
  • ఒరియా
  • పంజాబీ
  • సంస్కృతం
  • సింధీ
  • తమిళం
  • తెలుగు
  • శాంటూ
  • మైథిలి
  • డోగ్రి
విద్యా హక్కు (RTE) చట్టం, 2009 ప్రకారం, బోధనా మాధ్యమం పిల్లల మాతృభాషలో ఉండాలి.
Published date : 24 Sep 2020 12:56PM

Photo Stories