Skip to main content

సారాభాయ్ క్రేటర్

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విక్రమ్ సారాభాయ్ పేరు మీద చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్వాధీనం చేసుకున్న ఒక బిలానికి సారాభాయ్ అనే పేరు పెట్టింది.

సారాభాయ్ క్రేటర్

  •     “సారాభాయ్” క్రేటర్‌కు తూర్పున 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో అపోలో 17, లూనా 21 మిషన్లు దిగాయి.
  •     3 డి చిత్రాలలో క‌నిపించిన దాని బ‌ట్టి ఈ బిలం 1.7 కిలోమీటర్ల లోతు ఉందని, క్రేటర్ గోడల వాలు 25 నుంచి 35 డిగ్రీల మధ్య ఉందని తెలుస్తుంది.
  •     ఈ పరిశోధనలు లావాతో నిండిన లూన‌ర్ (చంద్ర) ప్రాంతంలో జ‌రిగే చ‌ర్యలు అర్థం చేసుకోవడానికి అంతరిక్ష శాస్త్రవేత్తలకు సహాయపడతాయి.

నేపథ్యం:

  •     సారాభాయ్ ఒక భారతీయ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ఆయ‌న‌ అంతరిక్ష పరిశోధనలను ప్రారంభించి భారతదేశంలో అణుశక్తిని అభివృద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషించారు.
  •     ఆయ‌నను భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా అంతర్జాతీయంగా గుర్తించారు.
  •     భారతదేశంలో స్పేస్ సైన్స్‌గా పిలిచే ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్ఎల్)ను 1947లో ఆయన స్థాపించారు. ఆయ‌న‌ ఇస్రో వ్యవస్థాపకుడు.
  •     ఆయ‌న‌ భారతీయ‌ ఉపగ్రహ త‌యారీ, ప్రయోగం కోసం ప్రాజెక్ట్ను ప్రారంభించారు.
  •     ఫలితంగా, మొదటి భారతీయ ఉపగ్రహం, ఆర్యభట్టను 1975 లో రష్యన్ కాస్మోడ్రోమ్ ద్వారా కక్ష్యలోకి ప్రయోగించారు.
Published date : 05 Sep 2020 12:40PM

Photo Stories