Skip to main content

ప్రవాసీ భారతీయ దివస్

1915, జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకొని ఏటా జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్‌గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు.. భారతదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటారు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) వంటివి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

  • ఎల్‌ఎం సింఘ్వీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రవాస భారతీయులపై అధ్యయనం జరిపి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏటా జనవరి 9ను ప్రవాసీ భారతీయ దివస్‌గా జరపాలని నిర్ణయించారు. దివస్ సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వ్యక్తులను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులతో సత్కరిస్తారు.
తొలి ప్రవాసీ భారతీయ దివస్:
మొదటి ప్రవాసీ భారతీయ దివస్‌ను 2003, జనవరి 9న న్యూఢిల్లీలో నిర్వహించారు. 12వ ప్రవాసీ భారతీయ దివస్ 2014, జనవరి 7-9 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. సదస్సుకు 51 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా మలేషియా సహజ వనరులు, పర్యావరణ మంత్రి దాతుక్‌సెరీ జి.పళనివేల్ హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. వీరి వివరాలు..
  1. ఇలా గాంధీ (మహాత్మా గాంధీ ముని మనుమరాలు, దక్షిణాఫ్రికా)
  2. లీసా మారియా సింగ్ (ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనేటర్)
  3. కురియన్ వర్గీస్ (బహ్రెయిన్)
  4. రేణు ఖతోర్ (అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్)
  5. వాసుదేవ్ చంచ్‌లానీ (కెనడా)
  6. బికాస్ చంద్ర సన్యాల్ (ఫ్రాన్స్)
  7. సత్నారాయన్‌సింగ్ రాబిన్ బల్దేవ్‌సింగ్ (నెదర్లాండ్స్)
  8. శిశీంద్రన్ ముత్తువేల్ (పపువా న్యూగినియా)
  9. శిహాబుద్దీన్ వావాకుంజు (సౌదీ అరేబియా)
  10. షంషీర్ వాయలిల్ పరంబత్ (యూఏఈ)
  11. శైలేష్ లక్మన్ వర (బ్రిటన్)
  12. పార్థసారథి చిరామెల్ పిళ్లై (యూఎస్‌ఏ)
  13. రామకృష్ణ మిషన్ (ఫిజీ)
  • 2015 జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్‌ను గుజరాత్‌లో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహిస్తారు. గాంధీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు అయిన సందర్భంగా గుజరాత్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పవాసీ భారతీయ దివస్- వివరాలు

సదస్సు

సంవత్సరం

నగరం

1

2003

న్యూఢిల్లీ

2

2004

న్యూఢిల్లీ

3

2005

ముంబై

4

2006

హైదరాబాద్

5

2007

న్యూఢిల్లీ

6

2008

న్యూఢిల్లీ

7

2009

చెన్నై

8

2010

న్యూఢిల్లీ

9

2011

న్యూఢిల్లీ

10

2012

జైపూర్

11

2013

కోచి

12

2014

న్యూఢిల్లీ

13

2015

గాంధీనగర్

Published date : 05 Sep 2014 03:03PM

Photo Stories