Skip to main content

జాతీయ పౌర సేవ‌ల దినోత్సవాన్ని ఏప్రిల్ 21న జ‌రుపుకుంటారు:

ప్ర‌తి ఏడాది జాతీయ పౌర సేవ‌ల దినోత్స‌వాన్ని ఏప్రిల్ 21న జ‌రుపుకుంటారు.
పౌర సేవ‌ల వ్య‌వ‌స్థ దేశ ప‌రిపాల‌న యంత్రాంగానికి వెన్నుముకలాంటిది. ఇది రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా శాశ్వ‌త కార్య‌నిర్వాహ‌క శాఖ‌. ప్ర‌భ‌త్వ రూపొందించిన విధానాల‌ను, ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో విజ‌య‌వంతంగా అమ‌లు జ‌రిపే బాధ్య‌త పౌరసేవ‌కుల‌దే. పౌర సేవ‌ల విభాగాలు అంటే ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌(ఐఏఎస్‌), ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపీఎస్‌), ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్‌ (ఐఎఫ్ఎస్‌) ల‌తోపాటు సెంట్ర‌ల్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బీ త‌దిత‌ర‌స‌ర్వీసులు.

చ‌రిత్ర‌: బ్రిటిష్‌పాల‌న‌లో ఉన్న ఇండియ‌న్ సివిల్ స‌ర్వీస్ భార‌త స్వ‌తంత్ర అనంత‌రం ఆల్ ఇండియా సివిల్ స‌ర్వీస్‌గా మారింది. ఏప్రిల్ 21, 1947న స్వ‌దేశీ పార్ల‌మెంటు స‌భ్యుడు స‌ర్దార్ వ్ల‌భాయ్ ప‌టేల్ అఖిల భార‌త సేవ‌ల‌ను ప్రారంభించారు. ఢిల్లీలోని మెట్‌కాల్ఫ్ హౌస్‌లో ఉన్న ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ ట్రైనింగ్ స్కూల్లో ప‌టేల్ ప్ర‌సంగించారు. త‌న ప్ర‌సంగంలో పౌర సేవ‌కుల‌ను స్టీల్ ఫ్రేమ్‌ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు.

జాతీయ పౌర సేవ‌ల దినోత్స‌వం రోజున భార‌త ప్ర‌ధాన మంత్రి ప్ర‌జా ప‌రిపాల‌న రంగంలో అసాధార‌ణ సేవ‌లు అందించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు అవార్డుల‌ను ప్ర‌దానం చేస్తారు. జాతీయ పౌర సేవ‌ల దినోత్స‌వం రోజున ప‌బ్లిక్ అడ్మ‌నిస్ట్రేష‌న్‌లో అత్యుత్త‌మ సేవ‌ల‌ను అందించిన వారికి “ప్ర‌ధాన మంత్రి “అవార్డును ఇస్తారు.
Published date : 21 Apr 2020 06:35PM

Photo Stories