Skip to main content

ఇటీవ‌ల ఏది 100% సేంద్రీయ వ్యవ‌సాయ ప్రాంతంగా మారింది?

వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రైతు వెల్‌ఫేర్ కేంద్ర పాలిత ప్రాంత‌మైన లక్షద్వీప్‌ను సేంద్రీయ వ్యవసాయ ప్రాంతంగా ప్రకటించింది.
సిక్కిం తరువాత 100% సేంద్రీయ ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతంగా లక్షద్వీప్ గుర్తింపు పొందింది.

కేంద్రం ప‌థ‌క‌మైన‌ పరంపరగట్ కృషి వికాస్ యోజన (సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం) కింద అవసరమైన ధృవపత్రాలు, డిక్లారేష‌న్లు పొందిన తరువాత ఈ ప్రతిపాదనను అక్టోబర్ 26, 2020న ఆమోదించారు.

గత 15 సంవత్సరాలుగా లక్షద్వీప్‌లోకి మందులు,కొన్ని సౌందర్య సాధనాలు త‌ప్ప ఎటువంటి రసాయనాలు రవాణా కాలేదు. దీంతో లక్షద్వీప్ 100 శాతం సేంద్రీయంగా మారింది.

లక్షద్వీప్‌లోని రైతులు అంద‌రూ సేంద్రీయ వ్యవ‌సాయాన్నే అనుస‌రిస్తున్న‌ట్లు, దాని కోసం కంపోస్ట్, పౌల్ట్రీ ఎరువు, పచ్చి ఆకుల‌ ఎరువు ఉప‌యోగిస్తున్న‌ట్లు ఆ ప్రాంత అడ్మినిస్ర్టేష‌న్ ప్ర‌క‌టించింది.

మొక్కల రక్షణ కోసం ఈ ప్రాంతం సేంద్రీయ లేదా జీవ పద్ధతులను మాత్రమే అనుసరిస్తోంది. వ్యవసాయంలో సింథటిక్ రసాయనాల వాడ‌కాన్ని దశల త‌గ్గిస్తూ, 2005 నాటికి పూర్తిగా ఆప‌గ‌లిగారు.
Published date : 18 Dec 2020 03:16PM

Photo Stories