ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ-ధర్తి జియో పోర్టల్ ఉపయోగం తెలుసా?
Sakshi Education
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి 2020 అక్టోబర్ 21 న ఈ-ధార్తి జియో పోర్టల్‌ను ప్రారంభించారు. భారత ప్రభుత్వ ఈ-ధార్తి పోర్టల్‌లో మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) ఉండడం వల్ల మ్యాప్‌ను ఏకీకృతం చేయడంతో పాటు లీజు ప్లాన్స్‌ను కలుపుతుంది. ఇది సిస్టమ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్)ను ఎనేబుల్ చేస్తుంది.
ఈ-ధర్తి పోర్టల్:
- దీంట్లో భూమి, అభివృద్ధికి సంబంధించి సుమారు 60,000 వాణిజ్య, నివాస, పారిశ్రామిక, సంస్థాగత ఆస్తులతో ఉంటాయి. ఇది ఆస్తి ధృవీకరణ పత్రం, ఆస్తి రూపురేఖలను అందిస్తుంది. ఈ వివరాలను ఇప్పుడు పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు.
- ఆస్తి హోల్డర్‌కు భూమి రకం, ఆస్తి రకం, కేటాయింపు తేదీ, ఆస్తి స్థితి, ప్లాట్ ఏరియా, ఆస్తి చిరునామా వంటి ఆస్తి వివరాలను కలిగి ఉన్న ధృవీకరణ పత్రం అందిస్తుంది.
- ఈ ఆలోచన సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా అనవసరమైన వ్యాజ్యాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది. సర్టిఫికేట్‌లో అవసరమైన ఆస్తి వివరాలు. ఆస్తి స్థానాన్ని చూపించే మ్యాప్ ఉంటాయి.
Published date : 25 Nov 2020 02:08PM