Skip to main content

Indian Flag Rules and Regulations : వీరి వాహనాలపైనే త్రివర్ణ పతాకం పెట్టుకోవాలి.. లేదంటే..

స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంటే ఆగస్ట్ 15న చాలా మంది తమ వాహనాలపై త్రివర్ణ పతాకం పెట్టుకోవడాన్ని చూసేవుంటాం. అయితే ఇది చట్టవిరుద్ధం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని వివరాల ప్రకారం కొందరు ‍ప్రముఖులకు మాత్రమే తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్న ఉంచే హక్కు ఉంది.
Indian Flag Rules in Telugu
Indian Flag Rules

వీరుకాకుండా మరెవరైనా తమ కారుపై త్రివర్ణ పతాకాన్ని తగిలించడం చట్టవిరుద్ధం అవుతుంది. అయితే ఇంతకీ తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అర్హత కలిగినవారెవరో ఇప్పుడు తెలుసుకుందాం

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002లోని సెక్షన్ IX ప్రకారం కొందరు ప్రముఖులు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ప్రదర్శించే హక్కును కలిగి ఉంటారు. ఈ జాబితాలోని వారు వరుసగా..

☛ రాష్ట్రపతి
☛ ఉప రాష్ట్రపతి
☛ భారత ప్రధాన న్యాయమూర్తి 
☛ సుప్రీంకోర్టు న్యాయమూర్తి 
☛ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
☛ హైకోర్టుల న్యాయమూర్తులు
☛ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్
☛ విదేశాల్లోని భారతీయ మిషన్లు/ప్రతినిధులు, వారు నియమితులైన దేశాల్లో..
☛ ప్రధాన మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు
☛ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉప మంత్రులు
☛ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రులు
☛ రాష్ట్ర మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప మంత్రులు
స్పీకర్, లోక్‌సభ
☛ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ
☛ డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ
☛ రాష్ట్రాలలోని శాసన మండలి స్పీకర్లు
☛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల స్పీకర్లు
☛ రాష్ట్రాలలోని శాసన మండలి డిప్యూటీ స్పీకర్
☛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల డిప్యూటీ స్పీకర్‌లు

Published date : 15 Aug 2023 12:38PM

Photo Stories