Skip to main content

ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020: ర్యాంకులు

భారత్ ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)-2020 విడుదలైంది.
జనవరి 20న ఢిల్లీ జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ ఈ ఇండెక్స్‌ను విడుదల చేశారు. నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ సంయుక్తంగా ఈ సూచీని రూపొందించాయి. ఈ సూచీ తొలి ఎడిషన్ 2019, అక్టోబర్ 17న విడుదలైంది. అంటే 2020 ఏడాది విడుదలైన సూచీ రెండో ఎడిషన్.

మూడు కేటగిరీలుగా...
నూతన ఆవిష్కరణలకు అందించిన సహకారం, ఆవిష్కరణల పాలసీలను మెరుగుపరచడం వంటి విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును పరిగణనలోకి తీసుకుని 36 సూచికల ఆధారంగా సూచీలో ర్యాంకులు ఇచ్చారు. రాష్ట్రాలను 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలు, 9 నగర, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు.

సూచీలో ఏపీ, తెలంగాణ...
ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓవరాల్‌గా 24.19 స్కోరు సాధించి... పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ రాష్ట్రం 33.23 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. 2019 సూచీలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉన్నాయి.

ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020: ర్యాంకులు
17 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో...

ర్యాంకు

రాష్ట్రం

స్కోరు

1

కర్ణాటక

42.50

2

మహారాష్ట్ర

38.03

3

తమిళనాడు

37.91

4

తెలంగాణ

33.23

5

కేరళ

30.58

6

హరియాణా

25.81

7

ఆంధ్రప్రదేశ్

24.19

8

గుజరాత్

23.63

9

ఉత్తరప్రదేశ్

22.85

10

పంజాబ్

22.54

11

పశ్చిమ బెంగాల్

21.69

12

రాజస్తాన్

20.83

13

మధ్యప్రదేశ్

20.82

14

ఒడిశా

18.94

15

జార్ఖండ్

17.12

16

చత్తీస్‌గఢ్

15.77

17

బిహార్

14.48


10 ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాల కేటగిరీలో...

ర్యాంకు

రాష్ట్రం

స్కోరు

1

హిమాచల్ ప్రదేశ్

25.06

2

ఉత్తరాఖండ్

23.50

3

మణిపూర్

22.78

4

సిక్కిం

20.28

5

మిజోరం

16.93

6

అస్సాం

16.38

7

అరుణాచల్ ప్రదేశ్

14.90

8

నాగాలాండ్

14.11

9

త్రిపుర

12.84

10

మేఘాలయ

12.15


9 నగర, కేంద్ర పాలిత ప్రాంతాల కేటగిరీలో...

ర్యాంకు

రాష్ట్రం

స్కోరు

1

ఢిల్లీ

46.60

2

చండీగఢ్

38.57

3

డామన్&డయ్యూ

26.76

4

పుదుచ్చేరి

25.23

5

గోవా

24.92

6

దాద్రా&నగర్ హవేలీ

22.74

7

అండమాన్&నికోబార్ దీవులు

18.89

8

జమ్మూ&కశ్మీర్

18.62

9

లక్షద్వీప్

11.71

Published date : 21 Jan 2021 06:17PM

Photo Stories