ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్–2020 ర్యాంకులు
Sakshi Education
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకులను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది.
మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా..
దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. మొత్తం 111 మున్సిపాలిటీలకు ఈ ఇండెక్స్‌లో ర్యాంకులను కేటాయించారు.
పది లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో...
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకులను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ ర్యాంకులతో పాటు మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ)–2020 ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మార్చి 4న న్యూఢిల్లీలో ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. నగరాల్లోని సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితులను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకులను ప్రకటించారు.
విధానాల రూపకల్పనకు...
పోటీతత్వాన్ని పెంచడానికే కాకుండా భవిష్యత్తులో నగరాల అభివృద్ధికి అనువైన విధానాల రూపకల్పనకు ఈ ర్యాంకులు ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నగరాల్లో ప్రజల జీవన నాణ్యత, నగర ఆర్థిక సామర్థ్యం, సుస్థిరతకు ఈ ర్యాంకులు అద్దంపడతాయి.
111 నగరాల్లో...
ర్యాంకుల రూపకల్పనలో భాగంగా 2020 జనవరి 16 నుంచి 2020 మార్చి 20వ తేదీల మధ్యలో 111 నగరాల్లోని 32.2 లక్షల మంది ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇండెక్స్‌లో ప్రజాభిప్రాయానికి 30 శాతం, జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం వంటి 13 కొలమానాల పరిధిలోని 49 సూచికలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో భువనేశ్వర్‌కు అత్యధికమార్కులు దక్కాయి.
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ర్యాంకులు ఇలా...
జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ సూచీ అంచనా వేస్తుంది. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను తెలియజేస్తోంది. ఈ ఇండెక్స్‌లోని ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 111 నగరాలకు ఈ ఇండెక్స్‌లో ర్యాంకులను కేటాయించారు.
పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో...

ర్యాంకు | నగరం | రాష్ట్రం/యూటీ |
1 | బెంగళూరు | కర్ణాటక |
2 | పుణే | మహారాష్ట్ర |
3 | అహ్మదాబాద్ | గుజరాత్ |
4 | చెన్నై | తమిళనాడు |
5 | సూరత్ | గుజరాత్ |
6 | నవీ ముంబై | మహారాష్ట్ర |
7 | కోయంబత్తూర్ | తమిళనాడు |
8 | వడోదర | గుజరాత్ |
9 | ఇండోర్ | మధ్యప్రదేశ్ |
10 | గ్రేటర్ ముంబై | మహారాష్ట్ర |
41 | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ |
పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో...
ర్యాంకు | నగరం | రాష్ట్రం/యూటీ |
1 | సిమ్లా | హిమాచల్ ప్రదేశ్ |
2 | భువనేశ్వర్ | ఒడిశా |
3 | సిల్వస్స | దాద్రా,నగర్ హవేలి అండ్ డామన్, డయ్యూ |
4 | కాకినాడ | ఆంధ్రప్రదేశ్ |
5 | సేలం | తమిళనాడు |
6 | వెల్లూర్ | తమిళనాడు |
7 | గాంధీనగర్ | గుజరాత్ |
8 | గురుగ్రామ్ | హరియాణ |
9 | దావన్‌గెరె | కర్ణాటక |
10 | తిరుచిరాపల్లి | తమిళనాడు |
19 | వరంగల్ | తెలంగాణ |
22 | కరీంనగర్ | తెలంగాణ |
46 | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ |
మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా..
దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. మొత్తం 111 మున్సిపాలిటీలకు ఈ ఇండెక్స్‌లో ర్యాంకులను కేటాయించారు.
సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ ఇండెక్స్‌లోని ర్యాంకులను కూడా రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు.
పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో...
పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో...
ర్యాంకు | మున్సిపాలిటీ | రాష్ట్రం/యూటీ |
1 | ఇండోర్ | మధ్యప్రదేశ్ |
2 | సూరత్ | గుజరాత్ |
3 | భోపాల్ | మధ్యప్రదేశ్ |
4 | పింప్రీ చించ్వాడ్ | మహారాష్ట్ర |
5 | పుణే | మహారాష్ట్ర |
6 | అహ్మదాబాద్ | గుజరాత్ |
7 | రాయ్‌పూర్ | ఛత్తీస్‌గఢ్ |
8 | గ్రేటర్ ముంబై | మహారాష్ట్ర |
9 | విశాఖపట్నం | ఆంధ్రప్రదేశ్ |
10 | వడోదర | గుజరాత్ |
17 | హైదరాబాద్ | తెలంగాణ |
27 | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ |
పది లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో...
ర్యాంకు | మున్సిపాలిటీ | రాష్ట్ర/యూటీ |
1 | న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ | న్యూఢిల్లీ |
2 | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ |
3 | గాంధీనగర్ | గుజరాత్ |
4 | కర్నాల్ | హరియాణ |
5 | సేలం | తమిళనాడు |
6 | తిరుప్పూర్ | తమిళనాడు |
7 | బిలాస్‌పూర్ | ఛత్తీస్‌గఢ్ |
8 | ఉదయ్‌పూర్ | రాజస్థాన్ |
9 | ఝాన్సీ | ఉత్తర్ప్రదేశ్ |
10 | తిరునల్వేలి | తమిళనాడు |
11 | కాకినాడ | ఆంధ్రప్రదేశ్ |
18 | వరంగల్ | తెలంగాణ |
21 | కరీంనగర్ | తెలంగాణ |
Published date : 06 Mar 2021 03:16PM