Skip to main content

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్-2019

దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లకు, యూనివర్సిటీలకు.. ర్యాంకులు కేటాయించేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ మూడేళ్ల క్రితం (2016) నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)ను ప్రారంభించింది.
తాజాగా ఈ ఏడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్-2019 పేరుతో దేశంలోని టాప్-100 ఇన్‌స్టిట్యూట్‌ల ర్యాంకులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా విద్యాసంస్థలకు లభించిన ర్యాంకులు.. ఆయా విభాగాల్లో టాప్ 10 ర్యాంకులు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...

ఒకప్పుడు ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్ పరంగా భారత విద్యాసంస్థల గురించి తెలుసుకోవాలంటే.. అంతర్జాతీయంగా విడుదల చేసే క్యూఎస్, ఏఆర్‌డబ్ల్యూయూ, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ వంటివే ఆధారం. ఈ ర్యాంకింగ్స్ ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ విద్యాసంస్థలకే పరిమితం. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలకు సంబంధించిన సమాచారం, వాటి నాణ్యతా ప్రమాణాల గురించి తెలుసుకోవడం విద్యార్థులకు ఎంతో కష్టంగా ఉండేది. దాంతో ఎంహెచ్‌ఆర్‌డీ 2016 నుంచి దేశీయంగానూ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) పేరుతో ఏటా ర్యాంకులు విడుదల చేస్తోంది. తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించి ర్యాంకులు ప్రకటించింది. ఫలితంగా కొత్త విద్యాసంవత్సరంలో ఉన్నతవిద్యలో ప్రవేశం పొందాలనుకుంటున్న విద్యార్థులు దేశంలోని బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి తెలుసుకోవచ్చు.

మొత్తం తొమ్మిది విభాగాలు
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులను మొత్తం తొమ్మిది విభాగాలుగా వర్గీకరించారు. అవి..
  • ఓవరాల్ ర్యాంకింగ్
  • యూనివర్సిటీ ర్యాంకింగ్
  • ఇంజనీరింగ్ ర్యాంకింగ్
  • కాలేజ్ ర్యాంకింగ్
  • మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్
  • ఫార్మసీ ర్యాంకింగ్
  • ‘లా’ ర్యాంకింగ్
  • ఆర్కిటెక్చర్ ర్యాంకింగ్
  • మెడికల్ ర్యాంకింగ్.

వీటిలో ఓవరాల్, యూనివర్సిటీ, కాలేజ్ ర్యాంకులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించిన ప్రామాణికతకు సంబంధించినవి. మిగతా విభాగాలు ఆయా కోర్సులను అందించడంలో అత్యున్నత ఇన్‌స్టిట్యూట్స్ ఏవో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఫార్మసీ విభాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా ఫార్మసీలో ఉన్నతవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు దేశంలోని టాప్ ఫార్మసీ కాలేజీలు ఏవో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

అయిదు ప్రామాణికాలు
ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకుల కేటాయింపు పరంగా ఎంహెచ్‌ఆర్‌డీ అయిదు ప్రామాణికాలను నిర్దేశించింది. వాటిలో ఒక్కో ప్రామాణికానికి నిర్దిష్ట వెయిటేజీ పేర్కొని.. మొత్తం 100 పాయింట్ల స్కోర్‌కు క్రోడీకరించింది. ఇలా అన్ని ప్రామాణికాల్లోనూ పొందిన పాయింట్లను గణించి.. తుది స్కోర్‌ను లెక్కించి సదరు ఇన్‌స్టిట్యూట్‌లకు పాయింట్లు కేటాయించింది. ఈ పాయింట్ల ఆధారంగా అత్యధిక స్కోర్ సాధించిన ఇన్‌స్టిట్యూట్‌లకు టాప్-100 జాబితాలో చోటు కల్పించింది. అయిదు ప్రామాణికాలు.. వాటికి నిర్దేశించిన వెయిటేజీ పాయింట్ల వివరాలు..

ప్రామాణికాలు

పాయింట్లు

టీచింగ్ - లెర్నింగ్, రిసోర్సెస్

30

రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్

30

గ్రాడ్యుయేషన్ అవుట్‌కమ్స్

20

ఔట్‌రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ

10

పర్‌సెప్షన్

10


ఉప విభాగాలు
పైన పేర్కొన్న అయిదు ప్రామాణికాల్లో ఉప విభాగాలను కూడా ఎంహెచ్‌ఆర్‌డీ నిర్దేశించింది. ప్రతి పామాణికానికి తొలుత 100 పాయింట్లు కేటాయించింది. ఈ 100 పాయింట్లలో ఆయా ఉప విభాగాలకు నిర్దిష్టంగా కొన్ని పాయింట్లు నిర్దేశించింది. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రతి ప్రామాణికానికి తుది వెయిటేజీ పాయింట్ల కోణంలో స్కోర్‌ను నిర్దేశించింది. ఆ వివరాలు..
  1. టీచింగ్, లెర్నింగ్, రిసోర్సెస్:
    30 పాయింట్ల వెయిటేజీ ఉన్న ఈ ప్రామాణికాన్ని గణించేందుకు నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అవి..
    • విద్యార్థుల సంఖ్య-20
    • ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి-30
    • పీహెచ్‌డీ అనుభవం గల ఫ్యాకల్టీ సహా ఉమ్మడి ఫ్యాకల్టీ సంఖ్య-20
    • ఆర్థిక వనరులు, వినియోగం-30
  2. రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్:
    ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ పారామీటర్‌కు సంబంధించి తుది వెయిటేజీని గణించే క్రమంలో.. ఉప విభాగాలుగా నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని... ఒక్కోదానికి నిర్దిష్ట మార్కులు కేటాయించింది. అవి..
    • ఫ్యాకల్టీలు, రీసెర్చ్ స్కాలర్స్ ప్రచురించిన పబ్లికేషన్స్-30
    • రీసెర్చ్ పబ్లికేషన్స్-40
    • ఐపీఆర్ అండ్ పేటెంట్స్-15
    • ప్రాజెక్ట్‌ల ఫలితాలు, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ -15.
  3. గ్రాడ్యుయేషన్ అవుట్‌కమ్:
    ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వస్తున్న ఫలితాలు, ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులు, అకడమిక్ రికార్డ్‌లను పరిగణించే విధంగా.. ఈ పారామీటర్‌లోని అయిదు ఉపవిభాగాలకు పాయింట్లు నిర్దేశించింది. అవి..
    • ప్లేస్‌మెంట్స్, ఉన్నతవిద్య, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫలితాల పరంగా విద్యార్థుల ప్రతిభ-40.
    • యూనివర్సిటీ పరీక్షల్లో ఫలితాల తీరు-15.
    • ప్లేస్‌మెంట్స్‌లో సగటు వేతనాలు-20.
    • కోర్సులు పూర్తిచేసుకుని టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు-15.
    • పీహెచ్‌డీ పట్టా అందుకున్న విద్యార్థుల సంఖ్య-10.
  4. ఔట్ రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ:
    సదరు ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థులకు చేరువయ్యే క్రమంలో తీసుకుంటున్న చర్యలే ప్రధాన అంశాలుగా ఉన్న ఈ ఉప విభాగంలో మొత్తం నాలుగు అంశాలున్నాయి. అవి..
    • రీజనల్ డైవర్సిటీ (విదేశీ విద్యార్థులు, ఇతర ప్రాంతాల విద్యార్థులు)-30.
    • మహిళా విద్యార్థులు, అధ్యాపకులు-25.
    • సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య-25.
    • దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు-20.
  5. పర్‌సెప్షన్:
    నిర్దిష్టంగా ఒక ఇన్‌స్టిట్యూట్ పట్ల సమీప వర్గాల్లో నెలకొన్న అభిప్రాయం ఆధారంగా నాలుగు అంశాలను ఈ ఉప విభాగంలో చేర్చారు. అవి..
    • పీర్ పర్‌సెప్షన్-25.
    • అకడమిక్ పీర్స్-25.
    • పబ్లిక్ పర్‌సెప్షన్-25.
    • కాంపిటీటివ్‌నెస్-25.

‘ఓవరాల్’గా.. టాపర్ ఐఐటీ-చెన్నై
ర్యాంకుల విషయానికొస్తే ఈ ఏడాది మొదటి ర్యాంకును ఐఐటీ-చెన్నై దక్కించుకుంది. గతేడాది తొలి స్థానంలో నిలిచిన ఐఐఎస్‌సీ-బెంగళూరు.. ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది. మొత్తం 100 ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలతో విడుదల చేసిన ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీల వివరాలు..

ర్యాంకు

ఇన్‌స్టిట్యూట్

స్కోర్

1

ఐఐటీ -చెన్నై

83.88

2

ఐఐఎస్‌సీ-బెంగళూరు

82.28

3

ఐఐటీ-ఢిల్లీ

78.69

4

ఐఐటీ-ముంబై

78.62

5

ఐఐటీ-ఖరగ్‌పూర్

74.31

6

ఐఐటీ-కాన్పూర్

69.07

7

జేఎన్‌యూ-ఢిల్లీ

68.68

8

ఐఐటీ-రూర్కీ

67.68

9

ఐఐటీ-గువహటి

65.47

10

బెనారస్ హిందూ యూనివర్సిటీ

64.55


- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పదకొండో స్థానంలో నిలిచింది.

మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్.. టాప్-10 ఇన్‌స్టిట్యూట్స్

ర్యాంకు

ఇన్‌స్టిట్యూట్

స్కోర్

1

ఐఐఎం-బెంగళూరు

81.34

2

ఐఐఎం-అహ్మదాబాద్

80.61

3

ఐఐఎం-కోల్‌కతా

79.05

4

ఐఐఎం-లక్నో

67.29

5

ఐఐఎం-ఇండోర్

67.01

6

ఐఐటీ-ఖరగ్‌పూర్

66.64

7

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ

65.33

8

ఐఐఎం-కోజికోడ్

64.82

9

ఐఐటీ-ఢిల్లీ

62.89

10

ఐఐటీ-ముంబై

62.74


- మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్ విభాగంలో గత ఏడాది టాప్-10లో నాలుగు ఐఐటీలు నిలవగా ఈ ఏడాది ఆ సంఖ్య మూడుకు తగ్గడం గమనార్హం.

‘లా’ ఇన్‌స్టిట్యూట్స్.. టాప్-10 జాబితా

ర్యాంకు

ఇన్‌స్టిట్యూట్

స్కోర్

1

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ-బెంగళూరు

77.21

2

నేషనల్ లా యూనివర్సిటీ-ఢిల్లీ

76.23

3

నల్సార్-హైదరాబాద్

74.61

4

ఐఐటీ-ఖరగ్‌పూర్

69.81

5

వెస్ట్‌బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్

65.39

6

నేషనల్ లా యూనివర్సిటీ-జోధ్‌పూర్

63.94

7

సింబయాసిస్ లా స్కూల్

60.68

8

జామియా మిలియా ఇస్లామియా

59.49

9

గుజరాత్ నేషనల్ లా వర్సిటీ

58.64

10

రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా

55.53


కాలేజ్ వారీ ర్యాంకుల్లో టాప్-10 ఇన్‌స్టిట్యూట్‌లు
కాలేజ్ వారీగా కూడా విడుదల చేస్తున్న ర్యాంకుల జాబితాలో ఈ ఏడాది టాప్-10లో నిలిచిన కాలేజ్‌ల వివరాలు..

ర్యాంకు

కాలేజ్

స్కోర్

1

మిరిండా హౌస్-ఢిల్లీ

73.72

2

హిందూ కాలేజ్-ఢిల్లీ

70.57

3

ప్రెసిడెన్సీ కాలేజ్-చెన్నై

68.01

4

సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్-ఢిల్లీ

67.55

5

లేడీ శ్రీరామ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్- ఢిల్లీ

66.71

6

లయోలా కాలేజ్-చెన్నై

66.31

7

శ్రీ‌రామ్‌ కాలేజ్ ఆఫ్ కామర్స్ - ఢిల్లీ

64.94

8

రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజ్-రహారా

64.76

9

హన్స్‌రాజ్ కాలేజ్-ఢిల్లీ

64.65

10

సెయింట్ జేవియర్ కాలేజ్-కోల్‌కతా

64.50


ఫార్మసీ ప్రోగ్రామ్.. టాప్-10 ఇన్‌స్టిట్యూట్స్

ర్యాంకు

ఇన్‌స్టిట్యూట్

స్కోర్

1

జామియా హమ్‌దర్ద్-ఢిల్లీ

78.43

2

పంజాబ్ యూనివర్సిటీ

78.10

3

నైపర్-మొహాలీ

74.59

4

ఐసీటీ-ముంబై

74.32

5

బిట్స్-పిలానీ

69.09

6

నైపర్-హైదరాబాద్

68.29

7

మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ సెన్సైస్

67.20

8

జేఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ఫార్మసీ-నీలగిరి

63.17

9

నైపర్-గాంధీనగర్

62.10

10

జేఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ-మైసూరు

61.33


మెడికల్ ప్రోగ్రామ్స్.. టాప్-10 ఇన్‌స్టిట్యూట్స్

ర్యాంకు

ఇన్‌స్టిట్యూట్

స్కోర్

1

ఎయిమ్స్-ఢిల్లీ

87.52

2

పీజీఐఎంఈఆర్-చండీగఢ్

77.88

3

క్రిస్టియన్ మెడికల్ కాలేజ్-వెల్లూరు

70.32

4

సంజయ్‌గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్

64.16

5

అమృత విశ్వ విద్యా పీఠం

62.84

6

బెనారస్ హిందూ వర్సిటీ

61.66

7

కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్

61.40

8

జిప్‌మర్-పుదుచ్చేరి

61.38

9

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సెన్సైస్

59.80

10

కింగ్‌జార్జ్ మెడికల్ వర్సిటీ

58.53


‘యూనివర్సిటీ’ ర్యాంకులు
యూనివర్సిటీ విభాగంలో టాప్-10లో నిలిచిన యూనివర్సిటీలు, అవి పొందిన స్కోర్ల వివరాలు..

ర్యాంకు

యూనివర్సిటీ

స్కోర్

1

ఐఐఎస్‌సీ-బెంగళూరు

82.28

2

జేఎన్‌యూ-ఢిల్లీ

68.68

3

బీహెచ్‌యూ

64.55

4

హెచ్‌సీయూ

61.85

5

కోల్‌కతా యూనివర్సిటీ

60.87

6

జాదవ్‌పూర్ యూనివర్సిటీ

60.53

7

అన్నా యూనివర్సిటీ

60.35

8

అమృత విశ్వవిద్యాపీఠం

59.22

9

మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

58.50

10

సావిత్రిబాయి పూలే పుణె యూనివర్సిటీ

58.40


ఆర్కిటెక్చర్ సబ్జెక్టు టాప్ 10 ఇన్‌స్టిట్యూట్స్

ర్యాంకు

ఇన్‌స్టిట్యూట్

స్కోర్

1

ఐఐటీ-ఖరగ్‌పూర్

81.96

2

ఐఐటీ-రూర్కీ

78.33

3

ఎన్‌ఐటీ-కాలికట్

65.52

4

ఎస్‌పీఏ-ఢిల్లీ

62.49

5

కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-తిరువనంతపురం

59.47

6

ఎస్‌పీఏ-భోపాల్

58.72

7

ఎన్‌ఐటీ-తిరుచిరాపల్లి

58.65

8

జామియా మిలియా ఇస్లామియా

58.07

9

ఎస్‌పీఏ-విజయవాడ

57.07

10

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రాంచీ

56.62


ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ విభాగం ర్యాంకులు టాప్‌–10 ఇన్‌స్టిట్యూట్స్‌

ర్యాంకు

ఇన్‌స్టిట్యూట్‌

స్కోర్‌

1

ఐఐటీ–చెన్నై

89.05

2

ఐఐటీ–ఢిల్లీ

85.36

3

ఐఐటీ–ముంబై

84.40

4

ఐఐటీ–ఖరగ్‌పూర్‌

79.41

5

ఐఐటీ–కాన్పూర్‌

77.57

6

ఐఐటీ–రూర్కీ

74.57

7

ఐఐటీ–గువహటి

70.87

8

ఐఐటీ–హైదరాబాద్‌

63.92

9

అన్నా యూనివర్సిటీ

63.12

10

ఎన్‌ఐటీ–తిరుచిరాపల్లి

61.62


తెలుగు రాష్ట్రాల్లో టాప్ 100లో నిలిచిన పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, నిట్ వరంగల్, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్‌టీయూ-హైదరాబాద్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - హైదరాబాద్, స్విమ్స్-తిరుపతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ - కర్నూలు, ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ సెన్సైస్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఫార్మా సెన్సైస్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా - విశాఖపట్నం, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఎస్‌పీఏ-విజయవాడ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-విశాఖపట్నం.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nirfindia.org/Home

పెరిగిన రీసెర్చ్ కార్యకలాపాలు
ఐఐటీ-హైదరాబాద్‌లో జరుగుతున్న పరిశోధన, పబ్లికేషన్స్ కార్యకలాపాలు ఎనిమిదో ర్యాంకు సొంతం చేసుకోవడానికి దోహదం చేశాయి. వీటితోపాటు ఈసారి అన్ని పారామీటర్స్‌లోనూ ఇన్‌స్టిట్యూట్ మంచి పాయింట్లు సాధించింది. రాష్ట్రాల స్థాయిలోని వర్సిటీల్లోనూ రీసెర్చ్ కార్యకలాపాలు పెరగడం, ఫ్యాకల్టీ కొరత లేకుండా చర్యలు తీసుకోవడం ద్వారా అవి కూడా మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది.
- ప్రొఫెసర్ యు.బి.దేశాయ్, డెరైక్టర్, ఐఐటీ-హైదరాబాద్.
Published date : 22 Apr 2019 07:01PM

Photo Stories