Skip to main content

భారత రక్షణ వ్యవస్థ - అస్త్రశస్త్రాలు

భారత రక్షణ వ్యవస్థలో సైనిక, వైమానిక, నావికా దళాలు (త్రివిధ దళాలు) కీలకంగా వ్యవహరిస్తాయి. రాష్ట్రపతి భారత రక్షణ దళాలకు అధిపతిగా (సుప్రీం కమాండర్) ఉంటారు. రక్షణ దళాల ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి చైర్మన్‌గా ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహాలు కొనసాగుతున్నారు. ఏటా డిసెంబరు 7న రక్షణ దళాల ఫ్లాగ్ డేగా నిర్వహిస్తారు. భారత రక్షణ దళాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947, 1965, 1971, 1999ల్లో పాకిస్థాన్‌తో నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటు భారత్ 1962 లో చైనాతో యుద్ధం చేసింది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో 13 లక్షలకు పైగా సైనికులు దేశ రక్షణలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. దేశ భద్రతలో త్రివిధ దళాలతో పాటు పారామిలిటరీ దళాలు సేవలు అందిస్తున్నాయి.
త్రివిధ దళాల అధిపతులు
  • సైనిక దళాలు: జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్
  • నౌకా దళం: అడ్మిరల్ ఆర్.కె.ధోవన్
  • వాయుసేన: ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా
పారామిలిటరీ దళాలు
  • అస్సాం రైఫిల్స్: ఇది అత్యంత ప్రాచీన పారామిలిటరీ దళం. 1835 నుంచి పనిచేస్తోంది. అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం షిల్లాంగ్‌లో ఉంది.
  • ఇండియన్ కోస్ట్ గార్డ్: ఇది 1978లోప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత తీరరేఖను సంరక్షిస్తోంది.
  • స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎస్): ఇది 1962లో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో ఉంది.
సైనిక శిక్షణ కేంద్రాలు
  • నేషనల్ డిఫెన్స్ కాలేజ్ - న్యూఢిల్లీ
  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఖడక్ వస్లా
  • ఇండియన్ మిలిటరీ అకాడమీ- డెహ్రాడూన్
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ - చెన్నై
  • రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ - డెహ్రాడూన్
  • ఇన్‌ఫాంట్రీ స్కూల్ - మౌ (మధ్యప్రదేశ్)
  • కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ - ఖడ్కీ, మహరాష్ట్ర
  • మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్- సికింద్రాబాద్
  • ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ - పుణె
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ - పుణె
నౌకా దళ శిక్షణ కేంద్రాలు
  • కాలేజ్ ఆఫ్ నావల్ వార్‌ఫేర్ - ముంబై
  • ఇండియన్ నావల్ అకాడమీ - ఎజిమల
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ - గోవా
  • షిప్‌రైట్ స్కూల్ - విశాఖపట్నం
  • ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య - కోచి
  • ఐఎన్‌ఎస్ గరుడ - కోచి
  • ఐఎన్‌ఎస్ హమ్లా - ముంబై
  • ఐఎన్‌ఎస్ శాతవాహన - విశాఖపట్నం
  • ఐఎన్‌ఎస్ చిల్కా - ఒడిశా
  • ఐఎన్‌ఎస్ కుంజలి - ముంబై
వైమానికాదళ శిక్షణ కేంద్రాలు
  • ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ - బెంగళూరు
  • ఎయిర్‌ఫోర్స్ అకాడమీ - దుండిగల్ (హైదరాబాద్)
  • ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ - కోయంబత్తూర్
  • పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ - అలహాబాద్.
  • ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్ - జలహళ్లి
  • పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్ - ఆగ్రా
సంయుక్త విన్యాసాలు
  • మలబార్: భారత్, అమెరికా, జపాన్ నౌకాదళాలు
  • యుద్ధ్ అభ్యాస్: భారత్, అమెరికాల సైన్యాలు.
  • ఇంద్ర: భారత్, రష్యా నౌకాదళాలు.
  • వరుణ: భారత్, ఫ్రాన్స్ నౌకాదళాలు.
  • గరుడ: భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు.
  • సూర్యకిరణ్: భారత్, నేపాల్, సైనిక దళాలు.
  • హ్యాండ్ ఇన్ హ్యాండ్: భారత్, చైనా సైనిక దళాలు.
  • సింబెక్స్: భారత్, సింగపూర్ నౌకాదళాలు.
అణు జలాంతర్గాములు
ఐఎన్‌ఎస్ చక్ర: రష్యా నుంచి 2012, ఏప్రిల్‌లో ఐఎన్‌ఎస్ చక్రను దిగుమతి చేసుకున్నారు. దీని రష్యన్ పేరు కే- 152 నెర్పా.
ఐఎన్‌ఎస్ అరిహంత్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 2009, జూలై 26న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ స్వదీశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణుజలాంతర్గామిగా ప్రసిద్ధికెక్కింది.
వైమానిక దళం:
లక్ష్య:
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారుచేసింది. ఇది పైలట్ రహిత టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్
తేజస్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం.
నిశాంత్: ఇది మానవ రహిత(అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్) విమానం.
ధ్రువ్: హెచ్‌ఏఎల్ తయారుచేసిన హెలికాప్టర్. దీన్ని ఆధునికీకరించి రుద్ర అటాక్ హెలికాప్టర్‌ను తయారు చేశారు.
ఎంఐ 17- వీ5: ఈ హెలికాప్టర్లను రష్యా నుంచి కొనుగోలు చేశారు.
రఫాల్ ఫైటర్ జెట్స్: ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేయనున్న యుద్ధ విమానాలు.

అగ్ని-V: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-V. ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీని బరువు 50 టన్నులు, పొడవు 17.5 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. అగ్ని-V 1500 కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. దీన్ని ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి 2012, ఏఫ్రిల్‌లోతొలిసారి ప్రయోగించారు. తర్వాత 2013, సెప్టెంబరు, 2015 జవవరిలలో ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించారు.

క్షిపణులు
క్షిపణి ప్రయోగించే విధానం పరిధి (కి.మీ.)
పృథ్వీ-1 ఉపరితలం నుంచి ఉపరితలం 150
పృథ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలం 250-350
పృథ్వీ -3 ఉపరితలం నుంచి ఉపరితలం 350-600
శౌర్య ఉపరితలం నుంచి ఉపరితలం 750-1900
అగ్ని-1 ఉపరితలం నుంచి ఉపరితలం 700
అగ్ని-2 ఉపరితలం నుంచి ఉపరితలం 2,000-3,000
అగ్ని-3 ఉపరితలం నుంచి ఉపరితలం 3,500
అగ్ని-4 ఉపరితలం నుంచి ఉపరితలం 4,000
అగ్ని-5 ఉపరితలం నుంచి ఉపరితలం 5,000-6,000
ఆకాశ్ ఉపరితలం నుంచి గగనతలం 30
త్రిశూల్ ఉపరితలం నుంచి గగనతలం 9
అస్త్ర గగనతలం నుంచి గగనతలం 80- 110
నాగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి 4-5
ప్రహార్ ఉపరితలం నుంచి ఉపరితలం 150
ధనుష్ ఉపరితలం నుంచి ఉపరితలం 350
(పృథ్వీ క్షిపణికి నౌకాదళ వెర్షన్)
Published date : 23 Oct 2015 06:28PM

Photo Stories