అస్సాంలో దేశంలోనే పొడవైన నది రోప్‌వే
Sakshi Education
అస్సాం ప్రభుత్వం బ్రహ్మపుత్ర నదిపై 1.8 కిలోమీటర్ల పొడవైన రోప్‌వేను ప్రారంభించింది. దీన్ని భారతదేశంలోనే పొడవైన నది రోప్‌వేగా అభివర్ణించింది.
ప్రధానాంశాలు:
- 1.82 కిలోమీటర్ల ద్వి-కేబుల్ జిగ్-బ్యాక్ రోప్‌వే బ్రహ్మపుత్ర దక్షిణం వైపు నుంచి మరొక వైపు ఉన్న గువహతిలోని డౌల్ గోవింద ఆలయం వెనుక ఉన్న ఒక కొండను కలుపుతుంది.
- ఇది నది మధ్యలో ఉన్న మధ్యయుగానికి చెందిన శివాలయం, ఉమానంద హౌస్ ఉన్న పీకాక్ ద్వీపం మీదుగా వెళుతుంది.
- ఇది ఉత్తర, దక్షిణ ఒడ్డుల మధ్య ప్రయాణ సమయాన్ని 8 నిమిషాలకు తగ్గిస్తుంది.
- రెండు ఓడ్డుల మధ్య ప్రస్తుత ప్రయాణ ఎంపికలు ఫెర్రీ (30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ, ప్రస్తుత సీజన్‌ను బట్టి) లేదా రోడ్డు ద్వారా వంతెన నుంచి ట్రాఫిక్‌లో వెళితే గంటకు పైగా పడుతుంది.
Published date : 09 Sep 2020 03:19PM