Skip to main content

ఐఏఎఫ్‌ లోకి ఫ్రెంచ్ రాఫెల్ విమానాలు

ఇటీవల, భారత వైమానిక దళం (ఐఎఎఫ్) మొత్తం 36 విమ‌నాల్లో మొదటి బ్యాచ్ 5 ఫ్రెంచ్ రాఫెల్ ఏవియేషన్ కంబాట్ విమానాలను అంబాలా ఎయిర్ బేస్ (హరియాణా) వద్ద అందుకుంది.
రష్యా నుంచి సుఖోయ్ జెట్లను దిగుమతి చేసుకున్న 23 సంవత్సరాలలో భారతదేశం మొదటిసారిగా యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. మొత్తం 36 జెట్‌లు 2021 చివరి నాటికి భారత్‌కు చేరుకుంటాయి.

ప్రధానాంశాలు
భారతదేశానికి ప్రాముఖ్యత:
  • జాయింట్ స్ట్రాటజిక్ విజన్: హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఓవర్-ఫ్లైట్స్, సామూహిక విధ్వంసం చేసే ఆయుధాల నుంచి వ‌చ్చే ముప్పు నుంచి ఆ ప్రాంతాన్ని ర‌క్షించే ఉద్ధేశించిన జాయింట్ స్ట్రాటజిక్ విజన్ ఆఫ్ ఇండియా-ఫ్రాన్స్ కోఆపరేషన్ కు స‌హాయంగా ఈ రాఫెల్ కూడా చేరింది.
  • ఎయిర్ కంబాట్ సామర్ధ్యాల అప్‌గ్రేడ్: ఇది భారతదేశం యొక్క వైమానిక పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా వంటి పొరుగు శత్రు దేశాలను ఎదుర్కొంటున్నప్పుడు.
  • సరిపోలని సామర్థ్యాలు: ఈ విమానం గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్, లిబియా, మాలి, ఇరాక్, సిరియాలోని వైమానిక పోరాట కార్యకలాపాలలో తన సాటిలేని సామర్థ్యాలను నిరూపించింది.
  • ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్ తరువాత రాఫెల్ ఉన్న నాల్గో దేశం భారత్.
  • భారత వైమానిక దళం రాఫెల్ జెట్‌లతో అనుసంధానం చేయడానికి కొత్త తరం మీడియం-రేంజ్ మాడ్యులర్ ఎయిర్-టు-గ్రౌండ్ ఆయుధ వ్యవస్థ హామర్‌ను సేకరించే పనిలో ఉంది. హామర్ (హై ఎజైల్ మాడ్యులర్ మునిషన్ ఎక్స్‌టెండెడ్ రేంజ్) అనేది ఫ్రెంచ్ రక్షణ మేజర్ సఫ్రాన్ అభివృద్ధి చేసిన ప్రిసిష‌న్-గైడెడ్ క్షిపణి.
  • గేమ్ ఛేంజర్: మొత్తం 36 రాఫెల్ జెట్‌లు భారత వైమానిక దళంలో చేరిన తరువాత గేమ్ ఛేంజ‌ర్ గా మారే అవ‌కాశం ఉంది. ఎందుకంటే పొరుగు దేశాల‌లో ఉన్న ఏ విమానమూ దీని అత్యుత్తమ కైనమాటిక్ పనితీరు మరియు శక్తివంతమైన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌తో స‌రితూగే ప‌రిస్థితి లేదు.
  • రాఫెల్ జెట్‌ను యూఎస్ఏ స్టీల్త్ ఎఫ్-35 విమానం, ఎఫ్-22 తో పోల్చుతారు.
  • చైనాతో బోర్డర్ క్లాష్: రాఫెల్ చైనాతో అందుబాటులో ఉన్న ప్రస్తుత యుద్ధ విమానం జె-20 కంటే చాలా అధునాతనమైంది, ప్రాణాంతకం. అందువల్ల, ఇది చైనాతో సరిహద్దు ఘర్షణ సమయంలో భారత రక్షణ వ్యవ‌స్థకు ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • సంబంధిత ఆందోళనలు: రాఫెల్ విమానాలు చాలా విధాలుగా గేమ్ ఛేంజ‌ర్ గా ఉండొచ్చు కానీ భవిష్యత్తులో భారత వైమానిక దళం ఎదుర్కొంటునే సవాళ్లను ఇది పూర్తిగా తీర్చకపోవచ్చు.

ఐఏఎఫ్ ఫైటర్ జెట్ల త‌గ్గుద‌ల:
  • ఐఏఎఫ్ లో ఫైట‌ర్ జెట్ల త‌గ్గుద‌లను తనిఖీ చేయడానికి అత్యవసర జరిగింది, ఎందుకంటే దాని ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య 42 నుంచి 31 కి ప‌డిపోవ‌డం ఆందోళ‌న చెందేలా చేస్తోంది.
  • ప్రస్తుతం, దాని విమానంలో 30 స్క్వాడ్రన్ ఫైటర్ జెట్‌లు ఉన్నాయి. అందువల్ల, ఫైటర్ స్క్వాడ్రన్ల యొక్క అధీకృత బలాన్ని త్వరగా పెంచుకోవడం ప్రధాన దృష్టి కేంద్రాలలో ఒకటి.
  • పొరుగు దేశాలు సామర్థ్యం పెర‌గ‌డం: 2023 నాటికి పాకిస్తాన్ వైమానిక దళంలో 27 ఫైటర్ స్క్వాడ్రన్లు, చైనా పిఎల్‌ఎ వైమానిక దళం భారతదేశానికి వ్యతిరేకంగా కనీసం 42 స్క్వాడ్రన్‌లను కలిగి ఉంటుందని అంచనా వేశారు. అందువల్ల, విరోధులు ఇద్దరూ అంటే చైనా, పాకిస్తాన్ నిరంతరం టెక్నిక‌ల్గా పెరుగుతున్నా ఉత్తర, పశ్చిమ దేశాల‌ అభివ‌`ద్ధి పరిణామాలపై భారతదేశం ప‌ట్టు కోల్పోదు.
  • టు ఫ్రంట్ ఛాలెంజ్: టు-ఫ్రంట్ ఛాలెంజ్ (చైనా, పాకిస్తాన్‌తో యుద్ధం) కోసం 45 ఫైటర్ స్క్వాడ్రన్లని ఐఏఎఫ్ కావాల‌నుకున్నా, 2002 లో పార్లమెంటుపై ఉగ్రవాద దాడి తరువాత 42 స్క్వాడ్రన్‌లు ఉన్నాయి. అప్పటి నుంచి వీటి సంఖ్య క్రమంగా పడిపోతూ వ‌స్తోంది. అలాగే పాత రష్యన్ మిగ్ విమానాలైన‌ ఐదు స్క్వాడ్రన్లు తొలగించారు.
  • సరఫరా ఆలస్యం: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) ఎంకె -ఐ, ఎంకె IIను సేకరించాలని ఐఎఎఫ్ యోచిస్తోంది. అయితే, ఇండక్షన్ ప్లాన్ ని స‌ర‌ఫ‌రా చేయ‌డంలో హ‌ల్ వ‌ద్ద ఆల‌స్యం అవుతోంది.
  • అదేవిధంగా, ఐఏఎఫ్‌ జూన్ 2018 లో 114 మల్టీరోల్ ఫైటర్స్ కోసం విదేశీ తయారీదారులైన బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ మరియు సుఖోయ్ కంపెనీల‌ సమాచారం కోసం ఒక అభ్యర్థనను జారీ చేసింది. ఒప్పందం కుదిరిన 12 సంవత్సరాలలోపు విమానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
  • రష్యాతో సమస్యలు: ప్రమాదాల్లో కోల్పోయిన 12 సు -30 ఎంకేఐలను త‌యారు చేయ‌డానికి హెచ్‌ఏఎల్, రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని ప్రభుత్వం ఆమోదించింది.
  • ఏదేమైనా, 11 సంవత్సరాల తరువాత ఐదో తరం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (FGFA) ను అభివృద్ధి చేయడానికి IAF, సుఖోయ్తో సహకార వెంచర్ నుంచి వైదొలిగడం, రష్యన్ తో సంబంధాల‌పై ప్రభావం చూపింది. ఖర్చు పంచుకునే ప్రణాళికలు, సాంకేతిక బదిలీలు, పరీక్షా విమానం యొక్క సాంకేతిక సామర్థ్యాలపై విభేదాలను ఎదుర్కొంది.
Published date : 15 Aug 2020 04:36PM

Photo Stories