Skip to main content

Summer Heat Effect : అత్యంత ‘వేడి’ సంవత్సరం ఇదే.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవ కాలం(1850–1900) ముందు నాటి ఉష్ణోగ్రత కంటే 2022లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదయ్యింది.
summer heat effect news telugu
hottest summer details

2022 సంవత్సరం ఇప్పటిదాకా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు ‘స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ క్లైమేట్‌–2022’ నివేదికను ఏప్రిల్ 21వ తేదీన (శుక్రవారం) విడుదల చేసింది. 

☛ Students Holidays 2023 : ఈ విద్యార్థులకు 77 రోజులు సెలవులు.. ఎందుకంటే..?

నివేదికలో ఏం వెల్లడించారంటే.. 

hottest summer details in telugu

☛ 2022లో అధిక ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో పంటల ఉత్పత్తి పడిపోయింది. పలు రాష్ట్రాల్లో అడవుల్లో కార్చిచ్చు వ్యాప్తించింది. 
☛ అంటార్కిటికాలో, యూరప్‌ల్లో హిమానీనదాలు కరిగిపోతున్నాయి.  
☛ 2013 నుంచి 2022 దాకా సముద్రాల నీటిమట్టం ప్రతిఏటా సగటున 4.62 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 1993– 2022 మధ్య రెట్టింపైంది.  
☛ 2015 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తద్వారా కార్బన్‌ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు పెరిగాయి. ఈ గ్రీన్‌హౌజ్‌ వాయువులు 2021లో రికార్డు స్థాయిలో వెలువడ్డాయి.  
☛ పంటల ఉత్పత్తి పడిపోవడం, అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభం కావడంతో భారత్‌ నుంచి గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొన్నాయి.  
☛ వాతావరణ మార్పుల వల్ల భారత్‌లో గతేడాది వరదలు కొండ చరియలు విరిగిపడడం వల్ల 700 మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 900 మంది బలయ్యారు.  
☛ అస్సాంలో వరదల వల్ల 6.63 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.  
ళీ గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలు పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతూనే ఉంటాయని, అవి భూగోళంపై మానవళికి ముప్పుగా పరిణమిస్తాయని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్‌ ప్రొఫెసర్‌ పెటిరీ తలాస్‌ చెప్పారు.  
☛ కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొనే శక్తి ప్రపంచంలో 100కుపైగా దేశాలకు ఏమాత్రం లేదని అధ్యయనంతో తేలింది.

☛ TS Schools Summer Holidays 2023 : స్కూళ్లకు 48 రోజులు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. అలాగే ఏడాది సెల‌వుల‌ పూర్తి వివ‌రాలు ఇవే..

➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

Published date : 22 Apr 2023 01:37PM

Photo Stories