YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా పథకం ఎప్పుడు..ఎందుకు ప్రారంభించారు..?
ఎందుకు..?
రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి ఆర్ధికంగా చేయూతనివ్వడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పంట దిగుబడిని పెంచాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతులకు..
ఖరీఫ్ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీన్లో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్‌లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది.