Skip to main content

ఆర్‌బీఐ 2018-19 వార్షిక నివేదిక

2018-19 (జూలై-జూన్) వార్షిక నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 29న విడుదల చేసింది.ఈ నివేదికలో భారత్ ప్రస్తుత మందగమన పరిస్థితులను ఆర్‌బీఐ తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. దీనిని సైక్లికల్ ఎఫెక్ట్ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
  • మౌలిక రంగ వ్యయాలకు భారీ మద్దతు నివ్వాల్సిన అవసరం ఉంది.
  • దేశీయ డిమాండ్ పరిస్థితులు ఊహించినదానికన్నా బలహీనంగా ఉన్నాయి. దీని పునరుద్ధరణకు వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవాలి.
  • వ్యాపార పరిస్థితులు మెరుగుపరచాలి.
  • ఆర్థిక వ్యవస్థలో సానుకూలతలూ ఉన్నాయి. తగిన వర్షపాతంతో అదుపులో ఉండే ధరలు, ద్రవ్యలోటు కట్టుతప్పకుండా చూసే పరిస్థితులు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి వంటివి ప్రధానం.
  • బ్యాంకింగ్‌లో వేగంగా విలీనాల ప్రక్రియ.
  • వరుసగా నాలుగు ద్వైమాసికాలాల్లో ఆర్‌బీఐ 1.10 శాతం రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.40 శాతం) లక్ష్యం వృద్ధి మందగమన నిరోధమే. 2019-20లో వృద్ధి 6.9 శాతంగా భావించడం జరుగుతోంది.
  • ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వైఫల్యం నేపథ్యంలో- వాణిజ్య రంగానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణం 20 శాతం పడిపోయింది. 2017-18లో రుణ పరిమాణం రూ.11.60 లక్షల కోట్లు ఉంటే, 2018-19లో ఈ మొత్తం రూ.9.34 లక్షల కోట్లు.
  • అమెరికా-చైనాల మధ్య వాణిజ్య సంబంధ అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం.
  • బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గాయి. 2017-18లో మొత్తం రుణాల్లో మొండిబాకాయిలు 11.2 శాతం ఉంటే, ఇది 2018-19లో 9.1 శాతానికి తగ్గాయి.
  • బ్యాంక్ మోసాల విలువ 2018-19లో రూ.71,543 కోట్లకు చేరాయి. 2017-18 నుంచి చూస్తే ఈ విలువ 73.8 శాతం (రూ.41,167.04 కోట్లు) పెరిగింది. ఇక కేసులు, 15% పెరుగుదలతో 5,916 నుంచి 6,801కి చేరాయి.
  • ప్రైవైటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలోనే విడుదల.
  • యువతకు ఆర్‌బీఐ పట్ల అవగాహన పెంచేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను విసృ్తతంగా ఉపయోగించుకోవడం.
  • కేంద్రానికి మిగులు నిధులు రూ.52,000 కోట్ల బదలాయింపుల నేపథ్యంలో ఆర్‌బీఐ వద్ద అత్యవసర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గుతోంది.
Published date : 31 Aug 2019 02:21PM

Photo Stories