Skip to main content

New Year Celebration : ప్రపంచంలో ముందుగా న్యూ ఇయర్ చేసుకునే దేశం ఇదే.. చివ‌రి దేశం మాత్రం..

న్యూ ఇయర్ వచ్చిందంటే ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది. ప్రస్తుత ఏడాదికి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతుంది. ఈ సందర్భగా డిసెంబర్ 31న బాణసంచా కాల్చి, విందు, వినోదాలతో ఉత్సాహంగా కన్పిస్తారు ప్రజలు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టవు.

కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి. అందుకే డిసెంబర్ 31 మొత్తం 25 గంటల పాటు కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. న్యూ ఇయర్ వేడుకలకు ప్రాచీన చరిత్ర ఉంది. 4,000 ఏళ్ల క్రితం ఇరాక్‌లోని బేబీలాన్ ప్రాంతం అందరికంటే ముందు కొత్త ఏడాదికి స్వాగతం పలికేది. కాలానుగుణంగా మార్పులు రావడంతో పరిస్థితులు మారాయి. 

ఇప్పుడు ఓసియానియా (ఆస్ట్రేలియా, ‍న్యూజిలాండ్‌ను కలిపే ప్రాంతం) ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందు 2023కు స్వాగతం పలుకుతుంది. టోంగా, కిరిబతి, సమోవా వంటి పసిఫిక్ ఐలాండ్ దేశాలు ఓసియానాలోనివే. అందుకే ప్రపంచంలోని ఇతర దేశాలకంటే ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకే ఓసియానియాలో సంబరాలు ప్రారంభమవుతాయి.

చివరగా ఏ దేశంలో ?

New Year 2023 News in Telugu

అమెరికా సమీపంలోని జనావాసాలు లేని బేకర్, హౌలాండ్ ద్వీపాలు న్యూయర్‌కు చివరగా స్వాగతం పలుకుతాయి. భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే జనవరి 1 సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రాంతం కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతుంది.

Published date : 31 Dec 2022 03:33PM

Photo Stories