GATE 2024 Score:ప్రవేశాలే కాదు... ఈ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా!
దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2024 పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ట్- 2024ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు (IISc-Bangalore) నిర్వహించనుంది.
GATE 2024: గేట్–2024తో పీఎస్‌యూ కొలువులు.. ఎంపిక ప్రక్రియ, విజయానికి మార్గాలు..
పరీక్షా తేదీలివే..
ఇప్పటికే దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు సెకండ్ పేపర్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే gate2024.iisc.ac.inలో హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈసారి కొత్తగా ఆ సబ్జెక్ట్ కూడా..
గేట్ పరీక్షల్లో గతంలో 29 సబ్జెక్ట్‌లు ఉండగా, ఈ సారి కొత్తగా డేట్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జె్క్ట్‌ను కొత్తగా చేర్చింది. దీంతో మొత్తంగా 30 సబ్జెక్ట్‌లు ఉండనున్నాయి. ప్రతి పేపర్‌లో జనరల్ ఆప్టిట్యూడ్ (GA) 15 మార్కులకు కామన్‌గా ఉంటుంది. మిగిలిన 85 మార్కులకు సంబంధిత సబ్జెక్ట్ సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక అభ్యర్థి ఒక పేపర్ లేదా గరిష్టంగా రెండు పేపర్లకు హాజరుకావచ్చు.
GATE 2024 Admit Card Out| Check direct link here
గేట్ స్కోర్‌తో స్కాలర్‌షిప్
ఇండియాలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గేట్(GATE) ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్ స్కోర్ మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో అభ్యర్థులు మూడేళ్లలోపు కాలేజీల్లో అడ్మీషన్స్ పొందవచ్చు. గేట్‌లో ఉత్తీర్ణత సాధించిన ఎంటెక్ విద్యార్థులకు నెలకు 12,400 రూపాయలు 22 నెలల పాటు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అదే పీహెచ్‌డీ వారికైతే మొదటి రెండు సంవత్సరాలకు రూ. 37,000, మూడవ ఏడాది నుంచి చివరి సంవత్సరం వరకు నెలకు రూ. 42,000లు స్కాలర్‌షిప్‌గా అందనుంది.
గేట్ స్కోర్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు
గేట్ స్కోర్ ఆధారంగా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు చేపడతారు. అలాగే బీహెచ్‌ఈఎల్, సీఆర్‌ఐస్, ఈసీఐల్, ఎన్‌టీపీసీ,బీఎస్‌ఎన్‌ఎల్,హెచ్‌పీసీఎల్,ఓన్‌జీసీ,ఈఐఎల్, డీవీఎస్, ఆర్‌ఎన్‌ఎల్, గెయిల్,బార్క్ వంటి వివిధ ప్రభుత్వరంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి.