Skip to main content

Free Training: ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ

Employment Opportunity ,Free training,Free Skill Development Training,Online Training for Unemployed
Free training

బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపల్లెలోని స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఏబీఆర్‌ గవర్నర్‌మెంట్‌ డిగ్రీ కళాశాల్లో శిక్షణ ఉంటుందని, ఆన్‌లైన్‌లో కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు.

జూనియర్‌ స్టాఫ్‌వేర్‌ డవలప్‌మెంట డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. వివరాలకు సి.హెచ్‌.రవి కుమార్‌ 9032384374ను సంప్రదించాలని సూచించారు.

Published date : 26 Sep 2023 01:36PM

Photo Stories