Floating Solar Project: కేరళలో తేలియాడే భారీ సోలార్ ప్రాజెక్ట్ సిద్ధం
Sakshi Education
![floating solar project in Kerala](/sites/default/files/images/2022/06/27/kseb-kerala-500kwp-floating-solar-power-banasurasagar-reservoir-1656331592.jpg)
దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు కార్యరూపంలోకి వచ్చింది. టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ ఈ ప్రాజెక్టును కేరళలోని కాయంకుళం వద్ద 350 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో గరిష్టంగా 101.6 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తరచూ మార్పు చెందే నీటి మట్టాలు, తీవ్రమైన సముద్ర అలల తాకిడి, నీటి లవణీయత వంటి సవాళ్లున్నా నిర్ణీత వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసినట్టు కంపెనీ ప్రకటించింది.
Also read: Digital Agriculture Wing: తెలంగాణ వ్యవసాయ రంగంలో డిజిటల్ అగ్రికల్చర్ వింగ్
Published date : 27 Jun 2022 05:36PM