Skip to main content

శిక్షణ తర్వాత కెరీర్‌ గ్రాఫ్‌ ఎలా ఉంటుంది?

Question
శిక్షణ తర్వాత కెరీర్‌ గ్రాఫ్‌ ఎలా ఉంటుంది?
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ త్రివిధ దళాల్లో ... వరుసగా లెఫ్టినెంట్‌, సబ్‌ లెఫ్టినెంట్‌, ఫై  ్లయింగ్‌ ఆఫీసర్‌ క్యాడర్‌తో ఆఫీసర్‌ స్థాయి కెరీర్‌ ప్రారంభమవుతుంది. అవకాశాన్ని బట్టి రక్షణ దళాల్లో సంబంధిత విభాగానికి భవిష్యత్తులో చీఫ్‌గా ఎంపిక కావచ్చు. పూర్తి కాలం సర్వీస్‌లో ఉన్న ప్రతిఒక్కరూ తప్పకుండా సంబంధిత విభాగంలో మేజర్‌ జనరల్‌/రేర్‌ అడ్మిరల్‌/ఎరుుర్‌ వైస్‌ మార్షల్‌ స్థారుుకి చేరుకుంటారు. విభాగాల వారీగా పరిశీలిస్తే.. ఆర్మీ: లెఫ్టినెంట్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభించి అత్యున్నత స్థానమైన చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాప్‌ వరకు చేరుకునే అవకాశం ఉంది. సర్వీసు ప్రకారం- వీరు కెప్టెన్‌, మేజర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌, కల్నల్‌, బ్రిగేడ్‌, మేజర్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌, వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌  హోదాలు లభిస్తాయి.

నేవీ: ప్రారంభ స్థాయి అయిన సబ్‌లెఫ్టినెంట్‌ నుంచి విశిష్ట హోదా అయిన అడ్మిరల్‌ వరకు చేరుకునే అవకాశం ఉంది. సర్వీసు నిబంధనలకనుగుణంగా లెఫ్టినెంట్‌, లెఫ్టినెంట్‌ కమాండర్‌, కమాండర్‌, కెప్టెన్‌, కమడోర్‌, రేర్‌ అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌(వీసీఎన్‌ఎస్‌) హోదాలను చేరుకొవచ్చు.

ఎయిర్‌ఫోర్స్‌: ఫై ్లయింగ్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభమవుతంది. తర్వాత అవకాశాన్ని బట్టి అత్యున్నత హోదా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌  స్థాయిని కూడా చేరుకోవచ్చు. సర్వీసుకు అనుగుణంగా ఫ్లైయింగ్‌ లెఫ్టినెంట్‌, స్క్వాడ్రన్‌ లీడర్‌, వింగ్‌ కమాండర్‌,గ్రూప్‌ కెప్టెన్‌, ఎయిర్‌ కమాండర్‌,ఎయిర్‌ వైస్‌ మార్షల్‌,ఎయిర్‌ మార్షల్‌,ఎయిర్‌ మార్షల్‌(వీసీఎన్‌ఎస్‌) హోదాలను చేరుకొవచ్చు.

Photo Stories