Skip to main content

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?

Question
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?
మొదటి దశ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్‌‌డ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో అభ్యర్థికున్న మానసిక ధ్రుడత్వాన్ని పరిశీలిస్తారు. మొత్తం 900 మార్కులకు వివిధ రకాల పరీక్షలను నిర్వహిస్తారు. అవి.. ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌, వెర్బల్‌ టెస్ట్‌, నాన్‌ వెర్బల్‌ టెస్ట్‌: అభ్యర్థిలో సామాజిక అంశాలపై అవగాహనను, తార్కిక విశ్లేషణ శక్తిని ఈ పరీక్షల్లో పరిశీలిస్తారు.

పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌: ఈ విభాగంలో ఒక ఇమేజ్‌(పటం)ను చూపించి దానికి సంబంధించిన సముచిత స్టోరీని రాయమంటారు. ఇందులో రాణించడానికి ప్రధాన మార్గం కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ థింకింగ్‌ను పెంచుకోవడమే.

సైకలాజికల్‌ టెస్ట్‌: ఈ టెస్ట్‌ మరో నాలుగు విభాగాల్లో జరుగుతుంది. అవి.. వర్డ్‌ అసోసియేషన్‌,ి పక్చర్‌ స్టోరీ టెస్ట్‌, సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌, సెల్ఫ్‌ డిస్క్రిప్షన్‌.

Photo Stories