మిసైల్ సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను. దీనికి ఏ కోర్సులు చదవాలి? ఎక్కడ ఉద్యోగాలు లభిస్తాయో తెలపండి?
- ఆర్.నాగేంద్ర, హైదరాబాద్.
Question
మిసైల్ సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను. దీనికి ఏ కోర్సులు చదవాలి? ఎక్కడ ఉద్యోగాలు లభిస్తాయో తెలపండి?
మిసైల్ సైంటిస్ట్ ప్రధా నంగా మిసైల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్య కలాపాల్లో పాల్గొంటాడు. మిసైల్ సైంటిస్ట్‌గా స్థిరప డేందుకు అవసరమైన ప్రా థమిక అర్హత...ఇంజనీరింగ్ డిగ్రీ. ఏరోస్పేస్/ఎలక్ట్రికల్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ /మెటలర్జికల్ తదితర బ్రాంచ్‌ల్లో ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మిసైల్ వంటి విభాగాల్లో సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో).. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన రక్షణ వ్యవస్థలు, పరికరాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా డీఆర్‌డీవో వివిధ మార్గాల్లో సైంటిస్ట్‌ల రిక్రూ ట్‌మెంట్ చేపడుతుంది. వీటిద్వారా నచ్చిన విభాగంలో సైంటిస్ట్‌గా అడుగుపెట్టొచ్చు.
నియామక విధానం :
డెరైక్ట్ ఎంట్రీ: సైంటిస్ట్ ఎంట్రీ టెస్ట్ (సెట్) ద్వారా క్లాస్‌వన్ ఆఫీసర్ పోస్టుల (గ్రూప్ ఏ)ను భర్తీ చేస్తోంది.
అర్హత: కెమికల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/మెకాని కల్ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
పరీక్ష తేదీ: ఏటా సెప్టెంబర్ మొదటి ఆదివా రం ఉంటుంది.
పరీక్ష సమయం: మూడు గంటలు.
క్యాంపస్ సెలక్షన్: ఈ విధానంలో ఎంపికైన అభ్యర్థులకు ‘సైంటిస్ట్ బి’ కేడర్ దక్కుతుంది.
అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) ఫైనలియర్ లేదా ప్రీ ఫైనలియర్ విద్యార్థులు అర్హులు. బ్యాక్‌లాగ్స్ లేకుండా కనీసం 65 శాతం ఉత్తీర్ణత సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.