ఎన్‌డీఏ ట్రైనింగ్ ఏవిధంగా ఉంటుంది?
Question
ఎన్‌డీఏ ట్రైనింగ్ ఏవిధంగా ఉంటుంది?
ఎన్డీఏలో అడుగుపెట్టిన విద్యార్థులకు రెండున్నరేళ్లపాటు క్లాస్ రూం ట్రైనింగ్.. ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారి సబ్జెక్టులకు అనుగుణంగా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీఎస్సీ, బీఏ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. ఇందుకోసం ఎన్డీఏలో ప్రవేశ సమయంలోనే విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న డిగ్రీని తెలియజేయాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ, నావల్ అకాడెమీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్/కెమిస్ట్రీ) కోర్సుగా ఎంచుకోవచ్చు. ఆర్మీ గ్రూప్ కోర్సుకు ఎంపికైన వాళ్లు బీఏలో హిస్టరీ/జాగ్రఫీ/ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్‌ల్లో నచ్చిన మూడు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అకాడెమీలో అన్ని విభాగాల వారికీ శిక్షణ ఒకే పద్ధతిలో ఉంటుంది. రక్షణ దళాల అవసరాలకనుగుణంగా శారీరక శిక్షణతోపాటు వర్క్‌షాప్, ఏరియూ స్టడీ, మిలిటరీ హిస్టరీలను సిలబస్‌తోపాటు బోధిస్తారు. ఎయిర్ ఫోర్స్ వింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అకాడెమీ(హైదరాబాద్)లో ఏడాది, ఆర్మీ వింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు(ఇండియన్ మిలటరీ అకాడెమీ, డెహ్రాడూన్)లో ఏడాది, నేవల్ అకాడెమీ ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలాల్లో శిక్షణనిస్తారు. దరఖాస్తు సమయంలో నావల్ అకాడెమీ(ఎజిమలా) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కు తొలి ప్రాధాన్యమిస్తే.. ఆ అభ్యర్థులకు విడిగా ఎజిమలాలో నాలుగేళ్ల శిక్షణనిస్తారు. ఆ శిక్షణ పూర్తి చేసుకుంటే బీటెక్ డిగ్రీ కూడా అందజేస్తారు. ఇన్ని దశలన్నీ పూరె్తైతే.. క్లాస్-1 కమిషన్డ్ అధికారి హోదాలో త్రివిధ దళాల్లో పాదం మోపినట్లే.